Breaking News

31/10/2019

అమల్లోకి వచ్చిన కొత్త మద్యం పాలసీ

హైద్రాబాద్, అక్టోబర్ 31 (way2newstv.in)
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి నూతన మద్యంపాలసీ ప్రారం భం కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు లక్కీడ్రా ద్వారా దుకాణదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. మద్యం దుకాణాల్లో కౌంటర్, మద్యం నిల్వచేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి ఎక్సైజ్‌శాఖ కంట్రోల్‌రూంకు అనుసంధానించాలి. మద్యం దుకాణదారుల నుంచి లెవీ స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ పన్నును ఏడాదికి రూ.5 లక్షల చొప్పున ఒకే వాయిదాలో వసూలుచేస్తారు. రిటైల్ మార్జిన్‌ను ఆర్డినరీ బ్రాండ్లపైన 27 శాతం, మీడియం, ప్రీమియం బ్రాండ్లపైన 20 శాతంగా.. బీర్లపై 20 శాతంగా నిర్ణయించారు. లైసెన్స్‌దారులు రెండేండ్ల ఎక్సైజ్ ఫీజు ను ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి. రెండేం డ్ల లైసెన్స్ ఫీజులో ఎనిమిదో భాగానికి సమానమైన రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్లుగానీ బ్యాంకు గ్యారెంటీలుగానీ సమర్పించాలి. 
అమల్లోకి వచ్చిన కొత్త మద్యం పాలసీ

రీనోటిఫికేషన్ తర్వాత కూడా ఏదైనా మద్యం దుకాణానికి దరఖాస్తులు రాకుండా ఖాళీగా ఉంటే ఎక్సైజ్‌శాఖ లేదా తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఔట్‌లెట్లు తెరిచేందుకు అనుమతి ఉంటుంది2021 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మద్యం దుకాణాల దరఖాస్తులకు ఈసారి రూ.2 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజును నిర్ణయించినప్పటికీ అనూహ్యంగా పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందా యి. సీఎం కేసీఆర్ సూచనలు, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ కీలకంగా వ్యవహరిస్తూ పలు వెసులుబాట్లు, మార్పులు చేర్పులతో కొత్త ఎక్సైజ్ విధానాన్ని రూపొందించడంతో మద్యం దుకాణాలను సొంతం చేసుకొనేందుకు పోటీపెరిగింది. 2,216 దుకాణాలకు 48,784 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.975.68 కోట్ల ఆదాయం సమకూరింది.లక్కీడ్రా ద్వారా అత్యంత పారదర్శక పద్ధతిలో దుకాణదారులను ఎంపికచేశారు. ఈసారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారుచేసింది. గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఈసారి ఆరు స్లాబులకు పెంచడంతో దుకాణదారులకు కొంత వెసులుబాటు కలిగినట్లయింది. ఐదు వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు, ఐదు వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.కోటి 10 లక్షల ఏడాది లైసెన్స్ ఫీజును నిర్ణయించారు. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

No comments:

Post a Comment