Breaking News

16/10/2019

కన్నా... ఎందుకిలా..

గుంటూరు, అక్టోబరు 16 (way2newstv.in)
నరేంద్రమోడీ.. దేశానికి ప్రధాని, బీజేపీకి ఈ దశకు తీసుకువచ్చి జనంలో ఇమేజ్ పెంచిన నాయకుడు. రెండు మార్లు పూర్తి మెజారిటీతో బీజేపీని గెలిపించిన దిగ్గజ వీరుడు. అటువంటి మోడీ కేంద్రంలో ఉండబట్టే ఏపీ బీజేపీ నేతలకు ఇక్కడ నోళ్ళు లేస్తున్నాయి. మరి మోడీ మాట మీద కూడా నమ్మకం లేదన్నట్లుగా ఏపీ నాయకులు వ్యవహరించడమే అసలైన విడ్డూరం. లేదా మోడీ గాలి కబుర్లు చెప్పారని భావించి కూడా అది పెద్దాయన‌కు అవమానమే. ఇంతకీ మోడీ విషయంలో ఏపీ నేతలు ఇలా విభేదించి మాట్లాడుతున్నారంటే అది వారి సొంత రాజకీయమే అనుకోవాలి. పార్టీలైన్ కాదనుకోవాలి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పోలవరంలో అవినీతి కనిపించడంలేదుట. వైసీపీ నాలుగు నెలలలో ఎక్కడా పోలవరం అవినీతిని నిరూపించలేకపోయిందని ఆయన అంటున్నారు. కేవలం ఆరోపణలు మాత్రమే చేసిందని కూడా క్లారిటీగా చెబుతున్నారు.
కన్నా... ఎందుకిలా..

ఇక ప్రధాని మోడీ ఎన్నికల ముందు ఇదే గోదావరి జిల్లాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో పోలవరంలో అవినీతి ఎలా ఏరులై పారుతోందో సభాముఖంగా చెప్పుకొచ్చారు. నాడు సభకు అధ్యక్షత వహించినది ఇదే కన్నా లక్ష్మీనారాయణ. ఇక పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని హాట్ కామెంట్స్ కూడా మోడీ నాడు చేశారు. మరి నాడు మోడీ పక్కన నిలబడి తలూపిన లక్ష్మీనారాయణకు ఇపుడు పోలవరంలో ఎక్కడా అవినీతి కనబడంలేదంటే ప్రధాని హోదాలో మోడీ పచ్చి అబద్దాలే చెప్పారనుకోవాలి. తమ అధినేతనే గాలి మాటలు మాట్లాడారని కన్నా ఒప్పుకునితీరాలి. మరి నాడు పోలవరం విషయంలో బాబుని తిట్టిన టిట్లు కూడా బీజేపీ నేతలు ఉపసంహరించుకోవాలేమో.పోలవరంలో అవినీతి నిరూపించి జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ కి వెళ్తే బాగుండేదని కన్నా అంటున్నారు. అంటే ఆధారాలు చూపిస్తేనే తప్ప నాలుగు డబ్బులు మిగల్చకూడదా అంటే కన్నా వారు అవును అనేట్లున్నారు. ఆధారాలు అంటే 840 కోట్లు తక్కువకు పోలవరం టెండర్లు జగన్ సర్కార్ ఇచ్చింది. మరి అవి కన్నాకు సరిపోవా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఇక సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు కోర్టులో పోలవరం అవినీతి మీద కేసులు వేశారు. దాని మీద విచారణకు కోర్టు ఆదేశించింది. దాన్నిబట్టి చూసినా కూడా పోలవరంలో ఏదో జరిగిందన్న సంగతి కన్నాకు తెలియదా. వైసీపీ మీద విమర్శలు చేయడానికి తప్ప కన్నాకు మరోటి కనిపించడంలేద‌న్న మాటలు అబద్దం కావేమోనంటున్నారు. సుజనాచౌదరి లాంటి వారు టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారంటే అర్ధం ఉంది కానీ కన్నా ఎందుకిలా గొంతు మార్చుతున్నారన్న దానికి ఏపీ పెద్దాయన వద్ద సమాధానం ఉందా?

No comments:

Post a Comment