వరంగలు అర్బన్,అక్టోబర్ 02,(way2newstv.in):
ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ఐ.టి., మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక్ రామారావు పర్యటన ఏర్పాట్లును బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ పరిశీలించారు. కుడా ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో 1.1 కిలో మీటర్ పొడవున అభివృద్ధి పరిచిన భద్రకాళి బండ్ పనులను కుడా చైర్మన్ మర్రి మాధవ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు.
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు
అలాగే భద్రకాళి బంద్ పొడిగింపు పనులు ప్రతిపాదనలను కూడా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమీషనర్ యన్.రవికిరణ్, కుడా ప్లానింగ్ ఆఫీసర్ ఇ.అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment