Breaking News

31/10/2019

కాస్ట్ కటింగ్స్ కు కాంగ్నిజెంట్

హైద్రాబాద్, అక్టోబర్ 31 (way2newstv.in):
ప్రముఖ ఐటీ కంపెనీ కాంగ్నిజెంట్ కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టింది. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో విడతల వారీగా 13వేల మంది ఐటీ ఉద్యోగులను తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ముందుగా 2020 నాటికి 7వేల మంది ఉద్యోగులు వెళ్లిపోవాలని కంపెనీ మేనేజ్ మెంట్ ఇప్పటికే చెప్పింది. ఆ తర్వాత మరో 6వేల మందికి ఉద్వాసన పలకనుంది. ఉద్యోగుల తొలగింపుపై కాంగ్నిజెంట్ మేనేజ్ మెంట్ స్పందించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వాస్తవమే అన్నారు. 
కాస్ట్ కటింగ్స్ కు కాంగ్నిజెంట్

తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ''10వేల నుంచి 12వేల మంది మిడ్-సీనియర్ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాము. అదే సమయంలో 5వేల మందిని కొత్తగా తీసుకుంటాము. అంటే.. 5 నుంచి 7వేల మందిని మాత్రమే తొలగించినట్టు అవుతుంది..'' అని కాంగ్నిజెంట్ సీఈవో బ్రెయిన్ తెలిపారు.కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బ్రెయిన్ వివరించారు. ఈ కారణంగా 2021 నాటికి కంపెనీ గ్రాస్ రన్ రేట్ సేవింగ్స్ 500 నుంచి 500 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో 4.2శాతం గ్రోత్ రేట్ సాధిస్తామన్నారు. రెవెన్యూ 4.25 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. కాగా, సెప్టెంబర్ 2019 నాటికి.. కాంగ్నిజెంట్ లో 2లక్షల 89వేల 900 మంది ఉద్యోగులు ఉన్నారు

No comments:

Post a Comment