Breaking News

12/10/2019

హిందూ ట్రంప్ కార్డు బయిటకు తీసిన టీడీపీ

విజయవాడ, అక్టోబరు 12, (way2newstv.in)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాట ఎపుడూ అంటూ ఉంటారు. అవకాశాలను వదులుకోరాదు, రాకపోతే మనమే సృష్టించుకోవాలని. అలాగే ప్రతి సమస్యలు సవాల్ గా తీసుకోవాలని కూడా ఆయన అంటారు. అందులోనే సమస్యలు సృష్టించైనా అవతల వారికి సవాల్ విసరాలన్న రాజ‌నీతి కూడా ఉండి ఉంటుంది. అందుకే చంద్రబాబు ఎపుడూ సమస్య కోసం పెద్దగా అలోచించరు. అవి ఆయన మెదడులోనే ఉంటాయి. అవతల వారిని ఇబ్బంది పెట్టాలంటే అప్పటికపుడు ఎన్ని సమస్యలు అయినా పుట్టుకువస్తాయి కూడా. ఇక ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది. ఈ నాలుగు నెలలూ చంద్రబాబు ఎక్కడా నోరు కట్టుకోలేదు. 
హిందూ ట్రంప్ కార్డు బయిటకు తీసిన టీడీపీ

పైగా ప్రతీ రోజూ మీడియాలో ఆయన పేరు కనిపిస్తూనే ఉంది. అంతలా ఆయన చురుకైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు.నిజానికి ఈ కార్డు మీద సర్వహక్కులు ఉన్నవి బీజేపీకి మాత్రమే. ఆ పార్టీ కూడా జగన్ విషయంలో ఈ నాలుగు నెలల్లో చాలా సార్లు కార్డు తీసి వాడినా ఉపయోగం లేకుండా పోయింది. అది తిరుపతి బస్సు టికెట్లలో అన్య మతస్థుల ప్రచారం కావచ్చు, శ్రీశైలంలో అన్య మతస్థులను అవకాశాలు ఇచ్చారన్న రచ్చ కావచ్చు. ఏది చేసిన సరే జగన్ వాస్తవాలు బయటపెట్టి బీజేపీ కార్డుని పక్కన పెట్టేలా చేయగలిగారు. మరిపుడు చంద్రబాబు వంతు వచ్చింది. అందుకే ఆయన జగన్ లో ఇపుడు అచ్చమైన క్రిస్టియన్ ని చూస్తున్నారు. తిరుపతి వెళ్ళి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో జగన్ పట్టువస్త్రాలు స్వామి వారికి సమర్పించడం అంటే చంద్రబాబుకు ఎక్కడో మంట పుట్టించినట్లుగా ఉంది. అందుకే జగన్ అన్య మతస్థుడు. ఆయన తిరుపతిలో స్వామిని దర్శించుకోవాలంటే తనకు విశ్వాసం ఉందని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా జగన్ హిందూ మతాన్ని అవమానించారంటూ చంద్రబాబు ఒంటి కాలి మీద లేస్తున్నారు. జగన్ తిరుమల పవిత్రతను అపహాస్యం చేస్తున్నారని కూడా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గారి అనుంగు శిష్యుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం జగన్ మీద ఇదే రకమైన విమర్శలు చేశారు. మూలా నక్షత్రం వేళ కాకుండా ముందు రోజు బెజవాడ కనకదుర్గమ్మ వారికి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించడం ఏంటి అని దేవినేని అంటున్నారు. హిందూ మతం మీద జగన్ భక్తి ఇలా ఉంది. ఆయన అంతా తన ఇష్టమేనని అనుకుంటున్నారా అంటూ పెద్ద గొంతు చేసుకున్నారు. దీని మీద వైసీపీ నుంచి గట్టి కౌంటర్లే పడ్డాయి. బూట్లు వేసుకుని మరీ ఆలయంలో చంద్రబాబు తిరిగినపుడు ఈ దేవినేని ఎక్కడికి పోయారని వైసీపీ నేతలు బాగానే తగులుకున్నారు. ఇక తిరుపతిలో జగన్ భక్తిభావంతో స్వామిని దర్శిచుకున్నారని, ఆయన విశ్వాస్వాన్ని అనుమానిచడానికి చంద్రబాబు ఎవరని కూడా ప్రశ్నించారు. పదుల సంఖ్యలో గుళ్ళూ గోపురాలు కొట్టేయించిన చంద్రబాబు హిందువుల గురించి మాట్లాడమేంటని కూడా మాజీ మంత్రి సి రామచంద్రయ్య లాంటి వారు అటాక్ చేశారు. ఎవరేమనుకున్న చంద్రబాబు మాత్రం జగన్ మీద హిందూ కార్డు కూడా వాడేయాలనుకోవడం బట్టి చూస్తూంటే ఆయన బీజేపీ బాటలోకి దిగిపోయారనిపిస్తోంది.

No comments:

Post a Comment