Breaking News

29/10/2019

ఏపీలో దత్తపుత్ర రాజకీయాలు

విజయవాడ, అక్టోబరు 29 (way2newstv.in)
అప్పట్లో చంద్రబాబు సహా టీడీపీ నాయకులు ఓ మాట చెప్పేవారు. సోనియాగాంధీకి రాహుల్ గాంధీ సొంత కొడుకు. జగన్ దత్తపుత్రుడు అని. ఇక కాంగ్రెస్ కి దగ్గరైన తరువాత ఇదే టీడీపీ ఫ్లేట్ ఫిరాయించి మోడీకి జగన్ దత్తపుత్రుడు అంటూ చెప్పుకొచ్చింది. సరే ఇవన్నీ జనాలూ పట్టించుకోలేదు. ఎక్కడా వర్కౌట్ కూడా కాలేదు, కానీ ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికి పనికివచ్చే కోట్స్ గా ఉన్నాయంతే. ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది. దాంతో వైసీపీలో పెద్ద నోరుగా ఉన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ రూట్లోనే పవన్ కల్యాణ్ ను విమర్శిస్తున్నారు. చంద్రబాబుని, పవన్ కల్యాణ్ ను ఒకే గాటకు కట్టి బాబుకు దత్తపుత్రుడు అంటున్నారు. పైగా బాబు, పవన్ కల్యాణ్ డీఎన్ ఎ ఒకటి అంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. నిజానికి సోనియాతో జగన్ ఎపుడూ కల్సిన చిత్రం లేదు. 
ఏపీలో దత్తపుత్ర రాజకీయాలు

ఆయన కాంగ్రెస్ లో ఉన్నదే అతి తక్కువ కాలం. అయినా కలిపి చెప్పగలిగిన దిట్టలు తమ్ముళ్ళు. ఇక మోడీతో కూడా జగన్ విపక్ష నేతగా పెద్దగా కల్సినది లేదు, కొన్ని సందర్భాల్లో తప్ప. అలాంటిది వాళ్లకే బంధాలు కట్టగాలేనిది. టీడీపీ అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడు అంటే తప్పేంటి అన్న వాదన కూడా వైసీపీలో ఉంది.నిజానికి పవన్ కల్యాణ్ రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదన్న విమర్శ ఉంది. ఆయన ఏ విషయంలోనూ నిలకడగా ఉండరని అంటారు. కానీ ఒక్క విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి గట్టిగా నిలబడే ఉన్నారు. అదే జగన్ ని ప్రత్యర్ధిగా చేసుకుని బాణాలు వేసే విషయంలో. జగన్ అంటే ఎందుకో పవన్ కల్యాణ్ కి గిట్టదు లా ఉంది అని కూడా తటస్థంగా ఉన్న వారు సైతం అనుమానించేలా ఆయన వైఖరి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా పవన్ కల్యాణ్ విమర్శలు అన్నీ కూడా జగన్ మీదనే చేసేవారు. అధికారంలో ఉన్న చంద్రబాబుని వదిలేసి మరీ జగన్ ని టార్గెట్ చేసేవారు. ఇక పవన్ కల్యాణ్ విమర్శల్లో పస ఏముందో తెలియదు కానీ బాబు అన్న మాటలేనే ఆయన వల్లిస్తారని ప్రచారం జరుగుతోంది. పైగా టీడీపీకి సబ్జెక్ట్ సిధ్ధంగా ఉంటుంది. వారు ఎలా కోరుకుంటే అలా అచ్చేసే అనుకూల మీడియా కూడా రెడీగా ఉంటుంది అందువల్ల జగన్ ని బదనాం చేసేందుకు ముందు ఊహాగానాలను అచ్చేస్తే వాటిని పట్టుకుని తమ్ముళ్ళు పూనకంతో వూగిపోతారని అంటారు. పవన్ కల్యాణ్ కి అటువంటి బాధ లేదు, ఆయన జనంలో ఉంటూ నిజమైన సమస్యలు ప్రస్తావిస్తే నాయకుడిగా నిలిచేవారేమో. కానీ పవన్ కల్యాణ్ సైతం అలా అచ్చేసిన సరుకునే పట్టుకుని జగన్ మీద విరుచుకుపడిపోతున్నపుడే వైసీపీకి కోపం వస్తోంది. జనాలకు అనుమానం కూడా కలుగుతోంది. అందుకే అంబటి పవన్ కల్యాణ్ ని దత్తపుత్రుడు అనేశారు.పవన్ కల్యాణ్ ది నిజంగా రాజకీయ నాయకుని మనస్తత్వం కాదని అంటారు. ఆయన సినిమాల్లో హీరో, అదే రకమైన ఆరాధనాభావాన్ని ఆయన ఇక్కడా ఆశిస్తారు. ఆయన మీద పూలే కురియాలి. ముళ్ళు వేయరాదు, అవసరం పడితే టీడీపీ అదే పని చేస్తుంది. బాబు అంతటి వారు పవన్ కల్యాణ్ ఇంటికెళ్ళి మద్దతు కోసం అర్ధిస్తారు. దాంతో పవన్ కల్యాణ్ టీడీపీ వైపు సానుకూలంగా ఉంటారని అంటారు. ఇక వైసీపీ, జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం అలా కాదు, ఇక్కడ జనంలో జగన్ కి ఏ సినీ హీరోకు తగ్గిపోని క్రేజ్ ఉంది. పైగా జగన్ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఆయన ఎవరినీ పెద్దగా పట్టించుకోరు. దాంతో పవన్ కల్యాణ్ ఎక్కడో హర్ట్ అయ్యారని చెబుతారు ఈ కారణంగానే ఆయన జగన్ ని టార్గెట్ చేస్తూ ఉంటారని ప్రచారంలో ఉంది. జగన్ ముఖ్యమంత్రి అవరు అని పవన్ కల్యాణ్ గట్టిగా అనుకున్నారట. కానీ సీన్ రివర్స్ అయి ఇంతటి మెజారిటీతో జగన్ ముఖ్యమంత్రి కావడం కూడా ఆయనకు వూహించలేని విధంగా ఉందని అంటారు. ఇవన్నీ కలసి ఇపుడు జగన్ ని పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తున్నారు తప్ప నిజంగా రాజకీయంగా కాదని అనేవారూ ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ జగన్ ని అంటే పవన్ని తిట్టడానికి వైసీపీలో ఆయన సామాజిక వర్గానికే చెందిన ఓ గ్రూప్ సిధ్ధంగా ఉంది. ఇదిపుడు ఏపీలో ఓ చిల్లర రాజకీయంగా మారిపోతోంది

No comments:

Post a Comment