Breaking News

26/10/2019

రియల్ ఫేవరేట్ గా ఆదిభట్ల

హైద్రాబాద్, అక్టోబరు 26, (way2newstv.in)
హైదరాబాద్ శివారు ప్రాంతాలు శ రవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్పుల నిర్మాణం జోరుగా సాగుతుండగా,  మారుతున్న లైఫ్ స్టైల్, టేస్ట్ లకు తగ్గట్టుగా సిటీ దాటి వెళ్లేందుకు నగరవాసులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో ఔటర్ సిటీ వైపు రియల్ వ్యాపారానికి భారీగా డిమాండ్ కొనసాగుతోందిసిటీలో వందల ఎకరాల్లో ఓపెన్ ప్లాటింగ్ వ్యాపారం నడుస్తోంది. ఇప్పటివరకు వెయ్యి ఎకరాల్లో వెంచర్లు వేసి కస్టమర్లకు అందజేశాం. ఇబ్రహీంపట్నంలో ప్రముఖ కాలేజీకి దగ్గర్లో భారీ వెంచర్ ఏర్పాటు చేశాం. 560 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ అనుమతులున్న జేబీ సెరెన్ సిటీ ప్రాజెక్టుతో రియల్ వ్యాపార రూపురేఖలు మారిపోయాయి. మార్కెట్లోకి వచ్చిన రెండేళ్లలో 90 శాతం ప్లాట్ల లావాదేవీలు పూర్తయ్యాయి. 

రియల్ ఫేవరేట్ గా ఆదిభట్ల

కొంగర కలాన్, మంగళ్ పల్లి, ఆదిభట్ల ప్రాజెక్టులు పూర్తి కాగా, జేబీ సెరెన్ లగ్జరీ విల్లాలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. 42 ఎకరాల విస్తీర్ణంలో 390 లగ్జరీ విల్లాలను నిర్మిస్తున్నాం. జేబీ ఇన్ ఫ్రాపై ఉన్న నమ్మకం, క్వాలిటీ, మౌలిక వసతుల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా కస్టమర్ల ప్రతి పైసకు విలువ వచ్చేలా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాం. ఓఆర్ఆర్ కు దగ్గరగా ఉండటంతో ముందు ముందు ఎన్నో లాభాలు గడించేలా ఈ విల్లాలు రూపొందిస్తున్నాం. మేడ్చల్ నుంచి శంషాబాద్ వరకు ఇప్పటికే ప్రాజెక్టులను లాంచ్ చేశాం. రానున్న రోజుల్లో పటాన్ చెరు నుంచి ఉప్పల్ వరకు వ్యాపారాన్ని విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం.వెస్ట్రన్ ఏరియాలో భూములకు పెరుగుతున్న డిమాండ్తో… భూముల ధరలు తక్కువగా ఉండే ప్రాంతాల వైపు అందరూ చూస్తున్నారు. ఈ క్రమంలో ఈస్ట్ వైపు ఉన్న ఉప్పల్, ఘట్ కేసర్, సాగర్ హైవే, ఆదిభట్ల, కొంగర కలాన్ వంటి ప్రాంతాలు హాట్ ఫేవరెట్. ఇప్పటికే ఈ ప్రాంతంలో వచ్చిన టీసీఎస్, టాటా సెజ్, ఏరోనాటిక్ పరిశ్రమకు అనువుగా ఉండే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో ఇటువైపు వస్తున్నారు. ముచ్చెర్ల ఫార్మా సిటీతో వచ్చే రెండేళ్లలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలకు తగినట్లుగా ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మహర్దశ వస్తోంది. ఇప్పటికే సిటీకి సరిహద్దులుగా ఉన్న జిల్లాల వరకు పరిధి పెరిగిన నేపథ్యంలో… క్యాపిటల్ టు  క్యాపిటల్ కాన్సెప్ట్ తో చౌటుప్పల్ ఏరియాలో మరో భారీ ఎకో ఫ్రెండ్లీ వెంచర్ కు ప్లాన్ చేస్తున్నాం.2002 నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో జేబీ ఇన్ ఫ్రా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, కొన్నేళ్లుగా ఓపెన్ ప్లాటింగ్ సెగ్మెంట్ లోనే వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటివరకు ఆదిభట్ల, తుర్కయాంజల్, తుక్కుగూడ, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఇబ్రహీంపట్నం, మాల్, మేడ్చల్ తోపాటు బీచ్ సిటీ వైజాగ్ లోనూ ప్రాజెక్టులను లాంచ్ చేశాం. హైదరాబాద్ లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వలసలు వస్తున్న  నేపథ్యంలో చాలా మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ధరలో, ప్రశాంతమైన వాతావరణం, ఆధునిక హంగులు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఉండే స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీగా భావించి మేము కూడా ఓపెన్ ప్లాటింగ్ నుంచి నిర్మాణ రంగంపై దృష్టిపెట్టాం.

No comments:

Post a Comment