Breaking News

05/10/2019

అసెంబ్లీకి వాస్తు కష్టాలు

హైద్రాబాద్, అక్టోబరు 5, (way2newstv.in)
ప్రజలకు ఆదర్శంగానూ, శాస్త్రీయ భావాలకు కేంద్రంగా ఉండాల్సిన అసెంబ్లీకి సైతం వాస్తు తిప్పలు తప్పడం లేదు. వాస్తు బాగలేదనే పేరుతో ఆ గదులకు దర్వాజాల స్థానంలో కిటికీలు, కిటికీల స్థానంలో దర్వాజాలు మార్చుకుంటున్నారు. గతంలో టీడీపీఎల్పీ, బీజేపీఎల్పీ కార్యాలయాలుగా పని చేశాయి. రాష్ట్రంలో టీడీపీ ఉనికి కోల్పోవడం, బీజేపీ ఓడిపోవడంతో ఆ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తే తమకు అదే పరిస్థితి వస్తున్న భయం పట్టుకుంది. తాజాగా ఈ గదులను శాసనమండలి విప్‌ కర్నె ప్రభాకర్‌, శాసనసభ విప్‌ గువ్వల బాలరాజులకు ఈ గదులను కేటాయించారు. వాస్తు భయంతో ఆ గదులకు మరమ్మతులు చేయిస్తూ, ప్రజాధనం వృథా చేస్తున్నారు. ఇటీవల మంచి ముహూర్తం చూసుకుని, ఆ గదులను ఆలకరించి, పూజలు నిర్వహించి ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. 
అసెంబ్లీకి వాస్తు కష్టాలు

ఇంతలోనే ఏమైందో తెలియదుగానీ ఆ గదులకే మరమ్మతులు చేపడుతున్నారు. దీనిపై అధికారులను సంప్రదించగా వాస్తు బాగోలేదని మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు. సొంత ఇంటికి ఎన్నిసార్లయినా మరమ్మతులు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ శాస్త్రీయ భావాలను ప్రచారం చేయాల్సిన ప్రజాప్రతినిధులు అశాస్త్రీయ భావాలను వెదజల్లుతున్నారనీ విమర్శలున్నాయి. వాస్తుకు అనుకూలంగా మార్పులు చేసేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా శాసనమండలి విప్‌ కర్నె ప్రభాకర్‌...ఆ ప్రాంగణంలో కార్యాలయం ఏర్పాటు చేసుకునే సంప్రదాయం ఉన్నది. అందుకు భిన్నంగా శాసనసభ ఆవరణలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌ అలీ ఇక్కడ కార్యాలయానికి అనుమతి ఇవ్వాలని కోరితే అసెంబ్లీ సచివాలయం తిరస్కరించినట్టు తెలిసింది. సీఎల్పీ కార్యాలయం వెనక భాగంలో డ్రయినేజీ పొంగిపొర్లుతున్నది. ఆ సమస్యను పరిష్కరించాలని నాలుగైదు సార్లు లేఖ రాసినా పట్టించుకోవడం లేదని ఆవర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment