Breaking News

11/10/2019

రాజధాని మార్పుపై కొత్త ఊహాగానాలు

హైద్రాబాద్, అక్టోబరు 11, (way2newstv.in)
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రి ఎలా ఉంది? ప‌్రజ‌లు ఏమ‌నుకుంటు న్నారు? మేధావి వ‌ర్గాలు దీనిపై ఏం ఆలోచ‌న చేస్తున్నాయి? రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎలాంటి చ‌ర్చ న‌డుస్తోంది? ఇప్పుడు జ‌గ‌న్ చుట్టూ జ‌రుగుతున్న చ‌ర్చల్లో ఇది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అమరావతి అనేది రాజకీయ అంశంగా మారింది. అది దురదృష్టం. రాజధాని ప్రజల కోసం. ప్రభుత్వం మారినంత మాత్రాన నిర్మాణాలు ఆపడం సబబు కాదు.- అనేది మేధావుల మాట‌గా ఉంది. ఇక‌, సామాన్యుల ప‌రిస్థితి కూడా దీనికి విరుద్ధంగా ఏమీ లేదు. 
రాజధాని మార్పుపై కొత్త ఊహాగానాలు

5 నెలల కిందట రోజుకు రూ.2 వేల వ్యాపారం జరిగేదని, రూ.500 ఇంటికి తీసుకెళ్లేవాడినని.. ప్రస్తుతం రూ.500 అమ్మితే రూ.50 మిగులుతున్నాయని రాజ‌ధాని ప్రాంతంలో బ‌డ్డీ కొట్టు నిర్వహించే వారు చేస్తున్న వ్యాఖ్యలు.రాజ‌ధాని విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఏం మాట్లాడినా.. రాజ‌కీయం చేస్తున్నార‌నే విమ‌ర్శలు అధికార ప‌క్షం నుంచి వినిపిస్తున్నా యి. అయితే, ఒక్కసారి స్థానికంగా ఉన్న ప‌రిస్థితిని అధ్యయ‌నం చేయాల్సిన అవ‌సరం వైసీపీ ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. నిధులు లేవని రాజధాని నిర్మాణం ఆపడం ముమ్మాటికి పొరపాటే. నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్‌, ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ వంటి సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయి. ఈ విష‌యంలో నిజానికి గ‌తంలో ప్రతిప‌క్షంలో ఉన్నస‌మ‌యంలో వైసీపీ అనుస‌రించిన విధానాలు కూడా కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వంపై త‌డ‌వ‌కోర‌కంగా దాడి చేసిన వైసీపీ నాయ‌కులు రాజ‌ధాని విష‌యంలోనూ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు.దీంతో నిర్మాణాల‌కు నిధులు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చిన ప్రపంచ బ్యాంకు త‌ర్వాత క్షేత్రస్థాయిలో ప‌రిస్థితిని అధ్యయ‌నం చేసేందుకు వ‌చ్చింది. ఈ క్రమంలోనే నిధుల విష‌యంలో వెన‌క్కి త‌గ్గింది. ఇక‌, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. ఇదిలావుంటే, అభివృద్ధి ప్రక్షాళ‌న చేస్తానంటూ.. జ‌గ‌న్ ప్రక‌టించ‌డంతో హైకోర్టు, రెండో రాజ‌ధాని విష‌యంలో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. త‌మ ప్రాంతంలో ఈ రెండింటిలో ఒక‌టి ఏర్పాటు చేయాలంటూ సీమ ప్రాంతంలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. వెర‌సి రాజ‌ధాని విష‌యం ఇప్పట్లో తెగేలా క‌నిపించ‌డం లేద‌నేది విశ్లేష‌కుల మాట‌.కానీ, రోజులు గ‌డిచే కొద్దీ.. ఈ విష‌యం మ‌రింత తీవ్రం అవుతుందే త‌ప్ప.. త‌గ్గద‌నేది వాస్తవం. అటు కేంద్ర ప్రభుత్వం విష‌యంలో అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రించ‌డంతో జ‌గ‌న్ రాజ‌ధాని విష‌యంలో డేరింగ్ స్టెప్ వేయ‌లేని ప‌రిస్థితి. మ‌రి కోట్లాది మంది రాష్ట్ర ప్రజ‌లు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో.. పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తారో.. ప్రజ‌ల‌ను ఎలా సంతృప్తి ప‌రుస్తారో చూడాలి.

No comments:

Post a Comment