Breaking News

05/10/2019

సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు...

విజయవాడ, అక్టోబరు 5, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నెంబరు 2 ఎవరు? చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునేదెవరు? అన్న ప్రశ్నకు నో అనే సమాధానం వస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి పాలయిన తర్వాత చంద్రబాబునాయుడు సీనియర్ నేతలను కూడా దూరంగా ఉంచుతున్నట్లు సమాచారం. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను తాను ఒక్కడే తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఖరి అలా ఉండేది కాదంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీనియర్ నేతలతో తొలుత చర్చించి చంద్రబాబు ప్రకటించేవారంటున్నారు.కాని ఎన్నికలకు ముందు నుంచే ఈ పరిస్థితి మారిందన్నది సీనియర్ నేతల అభిప్రాయం. 
సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు...

ఎన్డీఏ నుంచి వైదొలగడంలో గాని, ఒంటరిగా పోటీ చేసే విషయంలో గాని, అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చంద్రబాబు సీనియర్ నేతలను సంప్రదించలేదన్నది వాస్తవం.మిగిలిన వారు ఎలా ఉన్నప్పటికీ సీనియర్ నేతలైన యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి వంటి సీనియర్ల అభిప్రాయాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకునే వారు.కానీ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకోలేదట. అందుకే ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నది పార్టీ నేతల అభిప్రాయం.ముఖ్యంగా ఎన్నికలకు ముందు విడుదల చేసిన పసుపు కుంకుమ, అన్నదాతా సుఖీభవ, పింఛన్ల పెంచు వంటి కీలక నిర్ణయాల్లో కూడా సీనియర్ నేతలకు చోటు కల్పించలేదు. దీంతోనే వారు చంద్రబాబుకు కొంత దూరమయ్యారంటున్నారు.కానీ అప్పట్లో తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమాతోనే చంద్రబాబు వారిని పెద్దగా లెక్క చేయడం లేదట. ఇక ఎన్నికలు ముగిసి నాలుగు నెలలవుతుంది. పార్టీని ఎందరో నేతలు వీడిపోతున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి. అయినా వీటి విషయంలో చంద్రబాబు సీనియర్ నేతలను సంప్రదించడం లేదన్నది పసుపు పార్టీలో టాక్.దీనికి కారణాలు కూడా లేకపోలేదు. సీనియర్ నేతలతో పార్టీకి కొత్తగా వచ్చే బలం ఉండదు. పైగా వారు లేనిపోని సందేహాలు తలెత్తి అయోమయంలో పడేస్తారు. మరో నాలుగున్నరేళ్ల తర్వాత సీనియర్ నేతలు ఎవరూ పోటీకి సుముఖంగా ఉండరు. అందువల్లనే చంద్రబాబునాయుడు సీనియర్ నేతలను దగ్గరకు రానివ్వడం లేదంటున్నారు. సంస్థాగత ఎన్నికల్లో సయితం సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. పార్టీ కార్యాలయంలోనే ఉండి పార్టీ పటిష్టత కోసం పనిచేయవచ్చని సీనియర్లకు చంద్రబాబు సూచించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలకు చంద్రబాబు పొమ్మనకుండానే పొగపెడుతున్నారన్న టాక్ పార్టీలో నడుస్తుండటం విశేషం.

No comments:

Post a Comment