ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట సెప్టెంబర్ 26, (way2newstv.in)
హుజూర్ నగర్ లో జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్ర మలుపు తిరగబోతుంది. తెరాస నాయకులు పోలీస్ లను అడ్డుపెట్టుకొని గలీజు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ,దేశ స్థాయిలోజర్నలిస్ట్ ల సమస్యల పై పోరాటం చేస్తానని టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం అయన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మీడియాతో మాట్లాడారు.అవినీతి,అరాచకానికి, అధర్మనికి ,ధర్మం న్యాయానికి మధ్య పోరాటం జరుగుతుంది. నియోజక వర్గం లో కాంగ్రెస్ నాయకుల పై తెరాస నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలుచేస్తున్నారు. డబ్బులు తో కాంగ్రేస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపంచారు. కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్న.
కాంగ్రెస్ నేతలను కొంటున్నారు
కేటీఆర్…. మీ అయ్య ఇచ్చిన పదవులతో విర్రవీగవద్దని హెచ్చరించారు. మీ లాగా కుటుంబ,కుల, గలీజు రాజకీయాలు చేయలేదు. నోరు జారే కేటీఆర్ ఓ రాజకీయ బచ్చ అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ లో ఎన్ని కోట్లుదోచుకున్నావో ప్రజలకు చెప్పు. మేము చచ్చే వరకు నిజాయతీ,నిబద్దతో పని చేస్తాం. మీది ఓ బోగస్ సర్వే..14 శాతం ఎక్కువ ఉంటే కాంగ్రెస్ నాయకులను ఎలా కొనుగోలు చేస్తావనినిలదీసారు. హుజూర్ నగర్ టికెట్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం యామారం కు చెందిన ఆంధ్ర వ్యక్తికి ఎలా ఇచ్చావు. హజూర్ నగర్ లో ఆరు ఏండ్ల లో తెరాస ప్రభుత్వం ఏమిచేసిందని ప్రశ్నించారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాన్ని వ్యభిచారం చేస్తుండు. చంద్రబాబు తన్ని వెల్లగొట్టితే మా సొంత డబ్బుల తో కాంగ్రెస్ నుండి రెండు సార్లుయం.పి గా చేశాం. కౌన్సిల్ చైర్మన్ దిగజారిన రాజకీయాలు చేస్తుండు..ఆధారాలతో గౌవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. స్థానిక పోలీసులు పై నమ్మకం లేదు. కేంద్ర బలగాలనురప్పించాలి. కేటీఆర్ అంకుల్ నాపై కేసు పెడితే కోర్టు కొట్టివేసింది..ఈ బచ్చ మాట్లాడుతాడా.. నన్ను కేటీఆర్ ఏక వచనం తో పిలుస్తుండు.. భాష మార్చు కో అని అన్నారు. వయసుపదవికి గౌరవం ఇవ్వాలి. జిల్లా ప్రజలు గుత్తా సుఖేందర్ రెడ్డిని ఛీ కొడుతున్నారని ఉత్తమ్ అన్నారు.
No comments:
Post a Comment