Breaking News

26/09/2019

ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీగా బాద్యతలు చేపట్టిన కృష్టబాబు

విజయవాడ సెప్టెంబర్ 26, (way2newstv.in)
ఏపీఎస్ ఆర్టీసీ హౌస్ లో ఇన్ చార్జి ఎండీగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్టబాబు గురువారం బాద్యతలు చెపట్టారు.ఈ సందర్బంగా అయనను ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణబాబు మాట్లాడుతూ ఆర్టీసీ ఎండిగా బాద్యత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జనవరి 1 ని టార్గెట్ గా పెట్టుకుని విలీనంపై ముందుకు వెళ్తున్నాం. ఆర్టీసీ సంస్థ అలాగే ఉంటుంది సిబ్బంది మాత్రం రవాణా శాఖ పరిధిలోకి వస్తారని అన్నారు. 
ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీగా బాద్యతలు చేపట్టిన కృష్టబాబు

సిబ్బంది వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తే ఆర్టీసీని కాపాడుకోవచ్చు. డీజిల్ రూపాయి పెరిగితే సంవత్సరానికి 30 కోట్ల నష్టం వస్తుంది. ఆర్టీసీని మంచి సంస్థగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. దసరా ప్రయాణికుల రద్దీ కోసం 1800 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం. డీజిల్ బస్ ల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కు రాయితీతో ఎలక్ట్రికల్ బస్సులను అందిస్తోంది. ఒకొక్క బస్ కి 55 లక్షలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఇందులో భాగం6 350 ఎలక్ట్రికల్ బస్సులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. ఇందులో వివాదాలకు తావులేకుండా ఈ టెండర్ ద్వారా టెండర్లు స్వీకరిస్తున్నాం. లీజ్ కి ఎవ్వరు ముందుకు రాకపోతే అప్పుడు ఏం చేయాలి అన్నది ప్రభుత్వంతో మాట్లాడతాo. విజయవాడ, వైజాగ్, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రికల్ నడిపేందుకు కేంద్రం ఆసక్తి చూపుతోందని అన్నారు. ప్రతి సంవత్సరం 1000 ఎలక్ట్రికల్ బస్ లు తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.... ప్రస్తుతానికి 650 బస్ లకు టెండర్లు పిలిచామని అయన అన్నారు.

No comments:

Post a Comment