నల్గొండ, సెప్టెంబర్ 13, (way2newstv.in)
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో లక్షలాది రూపాయల నిధుల్ని విడుదలచేస్తుంది. అంగన్‌వాడీలకు ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పాలను సరఫరా చేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి లీటరు, రెండు లీటర్ల పరిమాణంగల పాల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.దీంతో అవి త్వరగా చెడిపోడుతున్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక్కో విధంగా పంపిణీ అవుతుండటంతో ఏయే ప్రాంతాల్లో పాలు నాణ్యంగా ఉంటున్నాయి, ఎక్కడ చెడిపోతున్నాయి అన్న విషయాన్నితెలుసుకొంటూ తనిఖీలు చేయడానికి ఆ శాఖ అధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో రాష్ట్ర మొత్తం ఒకే యూనిట్ కింద ఒకే రకమైన పాల ప్యాకెట్లను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది.
అంగన్ వాడీలకు టెట్రా పాలు
అదేవిధంగా గతంలో మాదిరిగా లీటరు, రెండు లీటర్ల పాలు కాకుండా లబ్ధిదారులకు అనువుగా ఉండేలా అర లీటర్ల పాల ప్యాకెట్లను పంపిణీ చేయాలని ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించినసమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటి పంపిణీకి సంబంధిత సంస్థలతో ఒప్పందం కుర్చుకొనే ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీని ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలకు మరికొన్ని రోజుల్లో కొన్నినెలలపాటు చెడిపోని టెట్రా పాలు సరఫరా కానున్నాయి. మందమైన ప్యాకెట్లలోని ఈ పాలు సుమారు మూడు నెలలపాటు చెడిపోకుండా, నాణ్యంగా ఉంటాయి. కేంద్రాలకు సరఫరా చేస్తున్న ఈప్యాకట్లను సులువుగా తనిఖీ చేసే అవకాశమూ ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పాలు, కోడిగుడ్లు, బాలామృతం, మధ్యాహ్న భోజనంఅందిస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాభియాన్ పథకం కింద ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు అంగన్‌వాడీల్లో లబ్ధిదారులకు పిండివంటలతో కూడిన పౌష్టికాహారంఅందిస్తున్నారు. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కాంట్రాక్టర్ల ద్వారా పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. సంబంధిత గుత్తేదారు కేంద్రాలకు ప్రతి రెండు నెలకు లీటరు నుంచి 2లీటర్లు పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఈ ప్యాకెట్లలోని పాలను అంగన్‌వాడీ కార్యకర్తలు ఒక్కో లబ్ధిదారుకు 100 మి. లీటర్ల చొప్పున అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పంపిణీఅయిన పాలు, పాల ప్యాకెట్లను నిల్వ ఉంచడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో రిఫ్రిజిరేటర్లు లేవు. దీంతో రెండు, మూడు రోజుల పాటు నిల్వ ఉండలేక పాలు కుళ్లిపోతూ దుర్వాసన వస్తున్నాయి.వేసవిలో ఎండవేడిమి ప్రభావంతో పాలు చెడిపోతున్నాయి. ఈ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు విడి, పాలిథిన్ సంచుల్లో పంపిణీ చేస్తున్న పాలను తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.పాలను తీసుకోకపోతే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికల్లో పోషకాహారం లోపించి రక్తహీనతతో బాధపడతారని, శారీరక ఎదుగుదల లోపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పలుసర్వేల్లోనూ ఇది బహిర్గతమైంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొన్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు టెట్రా పాల ప్యాకెట్లను పంపిణీ చేయడానికి పది రోజుల క్రితం సంబంధిత సంస్థతో ఒప్పందంకుదుర్చుకుంది.
No comments:
Post a Comment