Breaking News

18/09/2019

ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి

ముంబై, సెప్టెంబర్ 18 (way2newstv.in)
ఆధార్‌ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకున్నారా? ఇంకా లేదా? అయితే డెడ్‌లైన్ దగ్గరకు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 30 వరకు మీకు గడువు ఉంది. పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి. మీరు రెండింటినీ నిర్ణీత గడువులోగా లింక్ చేసుకోకపోతే ఆదాయపు పన్ను శాఖ మీ పాన్ కార్డును పనిచేయకుండా చేయొచ్చు.ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. 
ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి

ఇకపోతే ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇప్పుడు ఆధార్ నెంబర్ కూడా తెలియజేయాలి. పాన్ కార్డు లేనివారు ఆధార్ నెంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు. పాన్, ఆధార్ ఇంటర్‌ ఛేంజబుల్.ఆధార్ కార్డుతో పాన్ నెంబర్‌ను ఆన్‌లైన్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో అనుసంధానం చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం..ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఎస్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లండి. లేదా యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్‌కు కూడా వెళ్లొచ్చు. మీ వివరాలతో లాగిన్ అవ్వండి. లింకింగ్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోండి. మరో విండో ఓపెన్ అవుతుంది. ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లింక్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. రెండూ లింక్ అవుతాయి.యూఐడీపీఏఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత 567678కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌తోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment