సూర్యాపేట సెప్టెంబర్ 13, (way2newstv.in)
సూర్యాపేట పట్టణంలో జాతీయ రహదారిపై గల వెంకట సాయి పాత ఇనుప సామాన్లు షాప్ లో ప్రమాదం జరిగింది. పాత ప్లాస్టిక్ డబ్బా లని కటింగ్ చేస్తుండగా కటింగ్ మిషిన్ హిట్ అయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
పాత ఇనుప సామాను షాపులో పేలుడు
మృతుడు మహారాష్ట్రకు చెందిన రామచంద్ర సాహు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సల్మాన్, స్థానిక రామకోటి తండాకు చెందిన బుజ్జమ్మలు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్లాస్టిక్ కటింగ్ కోసం ఉపయోగించే కటింగ్ మిషన్ బ్రాండెడ్ మిషన్కాకుండా లోకల్ తయారీ మిషన్ వల్ల ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి కటింగ్ మిషన్ కారణమా మరి ఇతర కారణాలు ఎమైనా ఉన్నాయా, అన్ని కోణాల్లోవిచారిస్తున్నామని క్లూస్ టీమ్ నీ పిలిపించామని స్థానిక డిఎస్పి నాగేశ్వరావు వెల్లడించారు.
No comments:
Post a Comment