Breaking News

14/09/2019

బూర్గులకు ఘన నివాళులర్పించిన బండారు దత్తాత్రేయ

హైదరాబాద్ సెప్టెంబర్ 14, (way2newstv.in):
హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్య మంత్రి, ఉత్తర్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన దివంగత డా.బూర్గుల రామకృష్ణరావు 52వ వర్థంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి హిమాచల్ ప్రదేశ్రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం సమీపంలోని లిబర్టీ చౌరస్తా వద్ద ఉన్న బూర్గుల రామకృష్ణరావు విగ్రహానికిపూలమాలలు వేసిన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్ర ముఖ్య మంత్రిగా, నిస్వార్థంగా సేవలు అందించిన మహనీయులు బూర్గుల అని కొనియాడారు. 
బూర్గులకు ఘన నివాళులర్పించిన బండారు దత్తాత్రేయ

బహుభాష ప్రావిణ్యులైనబూర్గుల వ్యక్తిత్వం, సేవా నిరతి, పాలనాదక్షత ప్రతిఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. బూర్గుల రామకృష్ణరావు ఫౌండేషన్ ఛైర్మన్ డా.బి.బాబురావు వర్మ మాట్లాడుతూ పాలమూరువిశ్వవిద్యాలయాన్ని బూర్గుల రామకృష్ణరావు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు సి.హెచ్.రామచంద్రారెడ్డి, బూర్గుల నర్సింగ్ రావు, చంద్రప్రకాశ్,కోదండరాం, లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా బూర్గుల వర్థంతి కార్యక్రమానికి హాజరైన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, సిపిఆర్ఓవెంకటరమణలు స్వాగతం పలికారు.

No comments:

Post a Comment