Breaking News

19/09/2019

జమిలీతో ప్రాంతీయ పార్టీలకు చెక్కేనా

అనంతపురం, సెప్టెంబర్ 19, (way2newstv.in)
జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు తప్పదని రాజకీయాల్లో తలపండిన మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి అంటున్నారు. ఈ విశ్లేషణ ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఇపుడు దేశమంతా ఒక మాట ఉంది. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని. దానికి కారణలు కూడా ఉన్నాయి. మోడీ ఇపుడు బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దారుణంగా చితికిపోయింది. ఆ పార్టీ మళ్లీ కోలుకోకముందే ఎన్నికలకు వెళ్లి మరో అయిదేళ్ల పాటు అధికారం పొడిగించుకోవడానికి మోడీ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. అయితే జమిలి మీద ఇంకా ఏకాభిప్రాయం లేదు. కేంద్రంలోని ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందుల్లో ఉంది. మరో వైపు ఆర్ధిక మాంద్యం, దేశ‌ సరిహద్దుల్లో ఘర్షణలు, దేశంలో అనేక రకాలుగా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. 
జమిలీతో ప్రాంతీయ పార్టీలకు  చెక్కేనా

ఈ పరిస్థితుల్లో మోడీ జమిలి ఎన్నికలకు వెళ్తారా అన్నది మరో చర్చ.ఇక ఏపీ విషయానికి వస్తే జమిలి ఎన్నికలు రెండు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో 1999, 2004, 2009లో జమిలి ఎన్నికలు జరిగాయి. ఇక విభజన ఏపీలో 2014, 2019 లలో ఎన్నికలు నిర్వహించారు. నిజానికి 2014, 2019లలో మోడీ ప్రభంజనం దేశమంతా వీచింది. కానీ 2014లో ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. పొత్తులో భాగంగా టీడీపీ గెలిచిందనుకున్నా బీజేపీకి 12 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే నాలుగే దక్కించుంది. ఇక వైసీపీ బలమైన ప్రతిపక్షంగా 67 సీట్లు గెలుచుకుని నాడు సత్తా చాటింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ మొత్తానికి మొత్తం ఊడ్చేసింది. మోడీకి గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు పార్లమెంటు లో పెరిగినా ఏపీలో మాత్రం నోటా కంటే తక్కువ ఓట్ల వాటా బీజేపీకి దక్కింది. రాజకీయ పరిస్థితులు ఇలా ఉంటే జమిలి వస్తే ప్రాంతీయ పార్టీలు నిండా మునిగిపోతాయని జేసీ చెప్పడం ఎంతవరకూ తర్కానికి నిలబడుతుందన్నది ఆలోచిస్తే సందేహమేనని అంటున్నారు.ఏపీలో చూసుకుంటే బీజేపీకి పునాది అన్నది ఇప్పటికీ లేదు. పై పై చేరికలు పార్టీని బలోపేతం చేయవన్న మాట కూడా ఉంది. పార్టీలో పాతతరం కుంగిపోతూంటే కొత్త తరం తయారు కావడంలేదు బయట నుంచి వస్తున్న జంపింగ్ జపాంగులు సీజనల్ పక్షుల్లాంటి వారని, ప్రతికూలంగా వాతావరణం ఉంటే జారుకుంటారని అంటున్నారు. నిజానికి బీజేపీ సొంతంగా పదమూడు జిల్లాల్లో ఎక్కడా కొత్త నాయకత్వాన్ని ఇన్నేళ్ళ రాజకీయ ప్రస్థానంలో త‌యారుచేసుకోలేకపోయింది. మూడేళ్ళలో ఇది జరుగుతుందన్నది కూడా ఒక ఊహ మాత్రమే. ఇక ఏపీలో కుల సమీకరణలు బీజేపీకి ఆ చాన్స్ ఇవ్వవు. మతం కార్డ్ ఇక్కడ చెల్లదు, ఈ నేపధ్యంలో నుంచి చూసుకున్నపుడు జేసీ అన్న బీజేపీ ప్రభంజనం ఏపీలో బలంగా వీచే అవకాశాలు లేవన్నది వాస్తవమని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో బీజేపీకి 1998 ఎన్నికల్లో 19 శాతం ఓట్ల శాతం వచ్చింది. అపుడు కూడా ఆ ఓట్లతో తెలంగాణా వాటా ఎక్కువ. ఇపుడు మోడీ ప్రభంజనం మూడవసారి వచ్చినా కూడా బీజేపీ ఓట్ల శాతం అయిదు శాతం మించితే గొప్పేనని అంటున్నారు. సరిగ్గా ఈ రకమైన అంచనాలు దగ్గర ఉంచుకోబట్టే జగన్ జమిలి ఎన్నికలు సై అన్నాడని అంటున్నారు

No comments:

Post a Comment