Breaking News

14/09/2019

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

జిల్లా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి
వనపర్తి  సెప్టెంబర్ 14, (way2newstv.in):
జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డిఅన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన శనివారం వనపర్తిలోని ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వనపర్తి జిల్లా ప్రజా పరిషత్ మొదటి సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో వనపర్తి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాలుప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కారం చూపే వేదిక కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

జిల్లా పరిషత్ సభ్యులు ఆయా అంశాలపై చర్చల సందర్భంగా ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావాలని,  జెడ్పిటిసి, ఎంపీపీలు లేవనెత్తిన అంశాలను అధికారులు సావధానంగా విని వాటిని పరిష్కరించేందుకు సానుకూల దృక్పథంతో పనిచేయాలనికోరారు. ఐదు సంవత్సరాల కాలంలో జిల్లా ప్రజా పరిషత్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారమే ఉమ్మడి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. పశుసంవర్ధక శాఖ పై చర్చ సందర్భంగా రైతులు సొంత నిధులతో ప్రభుత్వ అంచనాలకు మించి పశువుల పాకలునిర్మించుకున్న కేసులలో నిబంధన ప్రకారం వారికి రావలసిన బిల్లులు  చెల్లిస్తే బాగుంటుందని సూచించారు. గ్రామీణ అభివృద్ధి పై చర్చ సందర్భంగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలుపూర్తయినప్పటికీ ఇంకా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రజలని కోరటం, సమావేశాలలో తీర్మానాలు చేయడం బాధాకరమని, అందువల్ల ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలుతీసుకొని ఇకపై ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉందని ఎంపీ అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని సమావేశానికి హాజరైన నాగర్కర్నూల్పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని అన్నారు. వనపర్తి జిల్లా అభివృద్ధిలోప్రజాప్రతినిధుల కన్నా అధికారుల పై నే బాధ్యత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలపై చర్చ సందర్భంగా పార్లమెంట్ సభ్యులుమాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న ఏవో పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కోరారు. రాష్ట్రంలో యూరియా కు ఏ లాంటి కొరత లేదని, యూరియా సమస్యనుత్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా విశాఖపట్టణం వెళ్లి రాష్ట్రానికి యు రియా వచ్చేలా కృషి చేశారని అన్నారు.జెడ్పిటిసి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రైతుబంధు కింద ఇంకా రైతులకు చెల్లింపులు చేయవలసి ఉందని, రుణమాఫీపై స్పష్టత లేదని అన్నారు. చిన్నంబావి జడ్పిటిసి వెంకట రామమ్మ మాట్లాడుతూరుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడిగారు. వనపర్తి ఎంపీపీ కిచ్చా రెడ్డి మాట్లాడుతూ ఆధార్ ఆధారంగా యూరియా ఇస్తున్నారని, పది ఎకరాల రైతు కు అడిగినంత యూరియా ఇవ్వటం లేదని తెలిపారు.జిల్లా వ్యవసాయ అధికారి శివనాగిరెడ్డి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.     పశుసంవర్ధక శాఖ పై జరిగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ అన్నిపశువైద్యశాలలో మందులు సిద్ధంగా ఉంచాలని, పశువుల షెడ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చిక్కేపల్లి లో ఇప్పటివరకుగొర్రెల పథకం కింద ఒక యూనిట్ కూడా రాలేదని అన్నారు. గొర్రెల యూనిట్ల పథకం లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు ఆర్డబ్ల్యూఎస్ పై జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ సూచించారు.గ్రామపంచాయతీ పై జరిగిన చర్చ సందర్భంగా గ్రామ పంచాయతీలలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి జిల్లాలో ప్రథమంగా నిలిచిన గ్రామానికి ఎల్ఈడి బల్బులను ఉచితంగాఅందిస్తానని పార్లమెంట్ సభ్యులు హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment