న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18, (way2newstv.in)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుణ్ని ప్రధాని మోదీ లైట్ తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. ఇప్పుడు లైట్ తీస్కోవడం ఏంటి..? 2014 ఎన్నికల ముందు నుంచే పట్టించుకోవడం లేదు కదా. ప్రత్యేక హోదా ఇవ్వం.. ఎన్డీయేలో ఉంటే ఉండు.. పోతే పో అన్నట్టుగా వ్యవహరించారు. అందుకే బాబు బయటకు వచ్చేశారు కదా అనుకుంటున్నారా. కావొచ్చు కానీ మళ్లీ ఇప్పుడు కూడా మోదీ పక్కనబెట్టారట.సెప్టెంబర్ 17న మోదీ పుట్టిన రోజనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు చెబుతూ దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు ట్వీట్లు చేశారు.
చంద్రబాబుకు కనీసం రిప్లై ఇవ్వని మోడీ
ఏపీ సీఎం వైఎస్ జగన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేటీఆర్, తెలంగాణ సీఎం(వో) తదితర ప్రముఖులు ట్విట్టర్ ద్వారా జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.తనకు విషెస్ చెప్పిన వారిలో చాలా మందికి ధన్యవాదాలు చెబుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, మహేశ్ బాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు చెప్పారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. దీంతో మోదీ ట్వీట్లన్నీ ఓపికగా చూసిన కొందరు ‘ఉత్సాహవంతులు’ బాబును మోదీ లైట్ తీసుకున్నారని ప్రచారం మొదలు పెట్టారు.అయినా ఓడిపోయిన చంద్రబాబుతో ప్రధాని మోదీకి ఇప్పుడేంటి అవసరం. జగన్‌కు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది సరే. గతంలో ఆ పార్టీ చంద్రబాబుకు ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్డీయే కన్వీనర్‌గా బాబు చక్రం తిప్పారు.ఇప్పుడు బాబును మోదీ లైట్ తీస్కున్నట్టే రేపు మరో నేతను లైట్ తీస్కోకుండా ఉంటారని అనుకోలేం కదా. ఆమాటకొస్తే.. సొంత పార్టీకి చెందిన చాలా మందికి మోదీ రిప్లయ్ ఇవ్వలేదు. ఆయనకు ట్విట్టర్లో 5.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన అకౌంట్‌ను చూసుకోవడానికి ఓ టీం ఉంది. ఇవన్నీ మర్చిపోతే ఎలా..? బాబును మోదీ లైట్ తీస్కున్నారో లేదోగానీ.. మనం ఈ విషయాన్ని లైట్ తీస్కోవడం బెటర్.
No comments:
Post a Comment