Breaking News

18/09/2019

పెట్రో బాంబు తప్పదా...

ముంబై, సెప్టెంబర్ 18, (way2newstv.in)
సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడులు చేయడంతో ఇంధన ధరలు భగ్గుమన్నాయన్న ఆందోళన మదుపరుల్లో స్పష్టంగా కనిపించింది. దేశ ఆర్థిక రంగాన్ని బూస్ట్‌ నివ్వడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన చర్యలు మార్కెట్లకు ఏ మాత్రం రుచించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమన్న ఇంధన ధరలతో ఈ రంగ షేర్లు కుదేలయ్యాయి. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) షేరు అయితే ఏకంగా 7 శాతానికి పైగా పతనం చెందింది. అలాగే హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ షేరు కూడా 5.70 శాతం తగ్గగా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 1.15 శాతం తగ్గింది. 
పెట్రో బాంబు తప్పదా...

సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో దేశీయ చమురు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని కొటక్‌ సెక్యూరిటీస్‌ విడుదల చేసిన నివేదికలో వెల్లడించిందిఫలితంగా ఈ వారం ప్రారంభరోజే భారీ నష్టాలను మూటగట్టుకున్నది. ఇంట్రాడేలో 356 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు 262 పాయింట్ల నష్టంతో 37,123.31 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ కూడా 79.80 పాయింట్లు అందుకొని 11 వేల పాయింట్ల దిగువకు 10,996.10 కి పడిపోయింది. మార్కెట్లలో 24 విభాగాలు నష్టపోగా, కేవలం ఆరు మాత్రమే లాభాల్లో ముగిశాయి. గరిష్ఠంగా మహీం ద్రా అండ్‌ మహీంద్రా 2.55 శాతం నష్టపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఎస్బీఐ, యెస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, హీరో మోటోకార్ప్‌, రిలయన్స్‌ల షేర్లు రెండు శాతం వరకు నష్టపోయాయి.వీటితోపాటు ఎన్‌టీపీసీ, టాటా మోటర్స్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతి, యాక్సిస్‌ బ్యాంక్‌, వేదాంతా లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటోల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. టెక్‌ మహీంద్రా 1.40 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌టెక్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇంధనం రంగ షేర్లు రెండు శాతం వరకు నష్టపోగా..ఆర్థిక, బ్యాంకెక్స్‌, రియల్టీ, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) రూ. 751.26 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.చమురు ధరల దెబ్బకు రూపాయి బక్కచిక్కిపోయింది. వరుసగా ఎనిమిది రోజులుగా పెరుగుతూ వచ్చిన మారకం విలువ  దిగువముఖం పట్టింది. ఫారెక్స్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 పైసలు పతనం చెంది 71.60 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడం, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడుల నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు భగ్గుమననున్నట్లు వచ్చిన సంకేతాలు రూపాయి పతనాన్ని శాసించాయని ఫారెక్స్‌ డీలర్‌ వెల్లడించారు.అత్యధిక స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒకటైన భారత్‌పై ఈ ప్ర భావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో కరెన్సీ కుదేలైందని వాలిడస్‌ వెల్తీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అఫీసర్‌ రాజేశ్‌ చెరువు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను బూస్ట్‌నివ్వడానికి గత శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పలు నిర్ణయాలు బ్రెంట్‌ ఆయిల్‌ దెబ్బకు కొట్టుకుపోయాయన్నారు.గ్లోబల్‌ మార్కెట్లో ఇంధన ధరలు స్కైరాకెట్‌ లెక్క దూసుకుపోవడంతో ఇంధన షేర్లతోపాటు విమానయాన రంగ షేర్లు కూడా పతనం చెందాయి.

No comments:

Post a Comment