Breaking News

21/09/2019

సీకే బాబు కు కలిసిరాని కాలం

తిరుపతి, సెప్టెంబర్ 21, (way2newstv.in)
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడు. కెపాసిటీ ఉండి కూడా క్లిక్ కాని నేతల జాబితాలో సీకే బాబు పేరును చేర్చవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఇష్టుడిగా ఉన్న సీకే బాబు రాజకీయ ప్రస్థానం ఇక ముగిసినట్లే. ఆయన మారని పార్టీలేదు. తొక్కని పార్టీ గడపా లేదు. దీంతో ఆయనకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజీ అయిపోయింది. చివరిగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక చిత్తూరు నుంచి సీకే బాబు ఫేడ్ అవుట్ అయినట్లేనన్నది వాస్తవం.నిజానికి సీకే బాబు కెపాసిటీ ఉన్న లీడర్. మాస్ లీడర్ గా సీకే బాబు ప్రజల్లో మమేకమైన వ్యక్తి. 
 సీకే బాబు కు కలిసిరాని కాలం

1989లో సీకే బాబు చిత్తూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరగలేదు. 1994, 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2004లో మాత్రం టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో తిరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్టుబట్టి కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించారు. 2009లోనూ సీకే బాబు గెలుపొందారు. నాలుగుసార్లు చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.అయితే వైఎస్ మరణం తర్వాత  సీకే బాబు వైసీపీలో చేరారు. 2014లో ఆయనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. అయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో ఆ పార్టీలోనే ఉండిపోయారు. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో పార్టీ కార్యక్రమాలను సీకే బాబు పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికే అక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న జంగాలపల్లి శ్రీనివాసులకు కాకుండా తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఇందుకు జగన్ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. బీజేపీలో చేరడానికి టీడీపీతో పొత్తులో భాగంగా తనకు చిత్తూరు టిక్కెట్ వస్తుందని ఆశించారు.కానీ బీజేపీతో చంద్రబాబు బంధాన్ని తెంచుకోవడంతో సీకే బాబు ఎన్నికలకు ముందు బేషరతుగా టీడీపీలో చేరారు. చంద్రబాబు కూడా సీకే బాబుకు ప్రాధాన్యత ఇచ్చారు. పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను సీకే బాబుపై పెట్టారు. అయితే చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా ఏ ఒక్క నియోజకవర్గమూ గెలవకపోవడం విశేషం. చంద్రబాబు ఇప్పుడు సీకే బాబును పక్కన పెట్టేశారు. ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ వైసీపీ వైపు సీకే బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కూడా సీకేబాబును పార్టీలోకి తీసుకునేందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సీకే బాబును పార్టీలో చేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు.

No comments:

Post a Comment