Breaking News

24/09/2019

టీడీపీని వెంటాడుతున్న విషాదాలు

చిత్తూరు, సెప్టెంబర్ 25, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ ప్రస్తావన వచ్చినపుడు దాని ఆవిర్భావం నాటి చారిత్రాత్మకమైన ఘటనలు గుర్తుకువస్తాయి. ఓ విధంగా ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్ రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన ఘనత టీడీపీకి ఉంది. తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తరువాత అనూహ్యంగా చంద్రబాబు నాయకత్వం కిందకు పార్టీ రావడంతో గత పాతికేళ్ళుగా తెలుగుదేశం పార్టీ మనుగడలో ఉందన్నది నిజం. ఇపుడు తెలుగుదేశం పార్టీ పెను సంక్షోభంలో చిక్కుకుంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని ఘోర అవమానం తాజా ఎన్నికల్లో జరిగింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలిచారు. 
టీడీపీని వెంటాడుతున్న విషాదాలు

వారిలో కూడా చాలా మంది ఇపుడు యాక్టివ్ గా లేరని ప్రచారంలో ఉంది. పార్టీ పటిష్టంగా ఉందని చెప్పుకుంటున్నా కూడా ఎక్కడా కదలిక లేని వాతావరణం కనిపిస్తోంది.దానికి తోడు అన్నట్లుగా తెలుగుదేశంలో ఇపుడు వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పల్నాటి పులిగా పేరు గడించి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న మేటి నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడడం తెలుగుదేశం పార్టీకి భారీ కుదుపుగా భావించాలి. కోడెల ఓడిపోయినా, ఆయన మీద ఎన్నికేసులు ఉన్నా బతికి ఉంటే ఆ కధ వేరేగా ఉండేది. ఇపుడు రాజకీయ వేధింపులు అని వైసీపీ సర్కార్ మీద చంద్రబాబు నెపం నెడుతున్నా క్రమంలో అదే ఆ పార్టీకి కొత్త ఇబ్బందులు తెచ్చే ప్రమాదమూ ఉందంటున్నారు. కోడెల లాంటి పులి ఈ జీవితం చాలు అనుకున్నపుడు రానున్న అయిదేళ్ళల్లో మిగిలే నాయకులు ఎందరు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇక కోడెల ఎపిసోడ్ లో టీడీపీ ఎంతలా సానుభూతి కోసం ప్రయత్నం చేసినా అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ కాలేదు సరికదా ఆయన ఆత్మహత్య మాత్రం తమ్ముళ్లలో కొత్త భయాలను నిండా నింపేసింది.ఇక రెండు దఫాలుగా చిత్తూరు ఎంపీగా పనిచేసిన సినీ నటుడు, వైద్యుడు అయిన శివప్రసాద్ మరణించడం పెను విషాదంగా చెప్పాలి. ఆయన అనారోగ్యంతో మరణించినా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకున్నపుడు ఈ కీలకమైన సమయంలో వెళ్ళిపోవడం బాధాకరం. ఆయన దళిత సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత. ఎంపీగా ఆయన పార్లమెంట్లో కంటే బయట చేసే హడావుడి తెలుగుదేశం పార్టీకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక మిగిలిన నాయకులు చూసినా కూడా వారంతా అరవైలు దాటేసిన వారే అధిక సంఖ్యలో ఉన్నారు. చాలా మంది చురుకైన దైనందిన రాజకీయాల్లో పాలు పంచుకోలేని స్థితిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో రెండవ శ్రేణి నాయకత్వం డెవలప్ కాకపోవడం పెద్ద లోటుగా ఉంది. వైసీపీలో యువకుడే ముఖ్యమంత్రి, అలాగే కొత నాయకులు, యువత అక్కడ ఎక్కువమంది కనిపిస్తూంటే టీడీపీలో వృధ్ధ నాయకత్వం ఉండడం కలవరం రేపుతోంది. దాంతో ఈ పెను సవాల్ ని తెలుగుదేశం ఎలా ధీటుగా ఎదుర్కొంటున్నది చూడాలి అంటున్నారు.

No comments:

Post a Comment