Breaking News

28/09/2019

రెండోసారి ట్రంప్ గెలుపు...నల్లేరుపై నడకేనా

న్యూయార్క్, సెప్టెంబర్ 28, (way2newstv.in)
ఒకప్పుడు అమెరికా సోవియట్ యూనియన్ అగ్రరాజ్యాలుగా ప్రపంచంపై పెత్తనం చెలాయించేవి. కాల క్రమంలో తొమ్మిదో దశకంలో సోవియట్ యూనియన్ పతనమైంది. ఆ దేశం ముక్కచెక్కలైంది. నాటి సోవియల్ యూనియన్ ప్రతిరూపమే నేటి రష్యా. రష్యా బలమైన దేశమైనప్పటికీ అమెరికాను పూర్తి స్థాయిలో ఎదిరించి ఢీ కొనే పరిస్థితిలో లేదు. దీంతో అమెరికా ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అమెరికాలో చీమ చిటుక్కుమన్నా యావత్ ప్రపంచానికి అది వార్త అవుతుంది. అటువంటిది అధ్యక్ష ఎన్నికలు అంటే ఇంకెంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వచ్చే ఏడాది నవంబర్ మొదటి వారంలో జరిగే ఈ ఎన్నికలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. రిపబ్లికన్లూ అధికారం కాపాడు కుంటారా, డెమెుక్రాట్లు అధికారాన్ని చేజిజిక్కుంచుకోగలరా అన్న ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. అసలు రెండు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. 
 రెండోసారి ట్రంప్ గెలుపు...నల్లేరుపై నడకేనా

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ డొనాల్డ్ ట్రంప్ ఎంపికవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.అమెరికా ఎన్నికల్లో గెలవడం ఎంత గొప్పొ, అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవడం అంతకన్నా గొప్ప. పార్టీ అధ్యక్ష అభ్యర్థికి ఎంపిక కావడం అంటే సగం విజయం సాధంచినట్లే లెక్క. అధ్యక్ష అభ్యర్థికి ఎంపిక అవ్వాలంటే పార్టీలో అంతర్గతంగా అనేక అడ్డంకులు అధిగమించాలి. ఈ అడ్డంకులను అధిగమించి రెండోసారి రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ ఎన్నికవడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఆయన చాలా ధీమాగా కనిపిస్తున్నారు. దీంతో ముందస్తుగా ప్రచారం ప్రారంభించారు. ఏ అభ్యర్థి అయినా గత నాలుగేళ్లలో అధికారంలో ఉండగా సాధించిన విజయాలు, వచ్చే నాలుగేళ్లలో చేయబోయే పనుల గురించి చెప్పాలి. కానీ ట్రంప్ దానికి భిన్నమైన పంథాను అనుసరిస్తున్నారు. పూర్తిగా జాతీయవాదం, విద్వేషాన్ని ప్రచార అస్త్రాలుగా మలచుకుని, ఎన్నికల గండాన్ని గట్టెక్కాలని చూస్తున్నట్లు కనపడుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి 2016 ఎన్నికల్లోనూ ఆయన ఈ అంశాల ఆధారంగానే గెలిచారు. ఇప్పుడు అదే బాటలో నడవనున్నారు.ఈసారి ట్రంప్ జాతివివక్షతను ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. జాతీయవాదానికి విభజన సూత్రాన్ని జోడించారు. మనసంస్కృతి అనే భావజాలాన్ని రెచ్చగొడుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారులనూ, మైనార్టీలను బూచిగా చూపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరాటపడుతున్నారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలు దిగువ సభలోని నలుగురు శ్వేతేతర సభ్యులను మీ స్వదేశానికి వెళ్లిపోవాలని అనడంపై దుమారం చెలరేగుతోంది. ట్రంప్ వాదనకు మద్దతుగా కొందరు సభ్యులు వారిని వెళ్లగొట్టండి అని నినాదాలు చేయడం ఆశ్ఛర్యం కలిగించింది. పక్కా వ్యూహంతోనే ట్రంప్ విధ్వేషవాదాన్ని ఎంచుకున్నారు. దీనివల్ల మోజారిటీ అమెరికన్లు తన వైపు నిలుస్తారన్నది ఆయన భావన. ప్రజలు కూడా రెచ్చగొట్టే ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. అమెరికా అందరిదీ అన్న అభిప్రాయం అమెరికాలో ఇటీవల తగ్గింది. వలస ప్రజలకు తలుపులు తెరిచి ఉండవచ్చని 62శాతం అమెరికన్లూ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఈ శాతం బాగా తగ్గిందని చెబుతున్నారు. వలసదారుల సంఖ్య పెరిగితే తమ సంస్కృతి కనుమరుగవుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. ఇవి తననకు సానుకూల అంశాలుగా ట్రంప్ భావిస్తున్నారు. వలసదారుల వల్ల స్థానిక అమెరికన్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండిపడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది అమెరికా ప్రజలను ఆకట్టుకుంటోంది.దీని ఫలితమే హెచ్ 1 బి తో పాటు ఇతర వీసాలపై ఆంక్షలు, కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించలేక ట్రంప్ రెచ్చగొడుతున్నారని ప్రత్యర్థుల వాదన. ఇది అంతగా పోవడం లేదు. వలసదారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తన్నుకుపోతున్నారన్న ప్రచారంతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు. మున్ముందు దానిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. దీని ద్వారా యువ ఒటర్ల తల్లిదండ్రులను కూడా ఆకట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు ట్రంప్. ట్రంప్ కు ప్రత్యర్థిగా డెమొక్రాట్లు ఇంతవరకు అభ్యర్థిని ఎంపిక చేయలేదు. అందువల్ల ఆ పార్టీ ఇంతవరకు ప్రచారం దాకా రాలేదు. ప్రస్తుతానికి ఇహన్ ఒమర్, అయన్నా ప్రెస్లీ, రషీదా తిలాబ్, అలెగ్జాండ్రియా, ఒకేసియో పేర్లు అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నాయి. ఖరారు కావడానికి ఇంకా సమయం పడుతుంది.ఈ లోపు ట్రంప్ ఒక దఫా ప్రచారం పూర్తి చేయడం ఖాయం.

No comments:

Post a Comment