Breaking News

18/09/2019

ప్రతి గ్రామానికి స్పెషలాఫీసర్ వెళ్లి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

కలెక్టర్ నారాయణరెడ్డి
ములుగు సెప్టెంబర్  18 (way2newstv.in)
జిల్లాలో చేపడుతున్న 30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. పరిశుభ్రత, పచ్చదనం పై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామాలలో డ్రైనేజీ లను 100% క్లీనింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామాలలో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు విజిలెన్స్ బృందాలు పర్యటించనున్నయని ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరిగిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 
ప్రతి గ్రామానికి స్పెషలాఫీసర్ వెళ్లి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రమదానం లో భాగస్వాములు  అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని గ్రామాలలో డంపింగ్ యార్డులు, స్మశానవాటికల  నిర్మాణ పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు.నెలలో 25, 26, 27 తేదీలలో అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.  అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు.  ప్రతి గ్రామపంచాయతీలో 85 శాతం మొక్కలను సంరక్షించుకునే దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో పాడుపడిన బావులు గుర్తించి వెంటనే పూడ్చి వేయాలన్నారు. ప్రతి గ్రామానికి స్పెషలాఫీసర్ వెళ్లి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని,  లేనట్లయితే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతిరోజు కార్యక్రమాలను పర్యవేక్షిస్తు  నివేదికలు అందించాలన్నారు. గ్రామాలలో ఇంకా ను మిగిలిపోయిన వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి చేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో విషజ్వరాలు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. రెగ్యులర్గా  స్ప్రేయింగ్  చేయించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

No comments:

Post a Comment