Breaking News

12/09/2019

తప్పులతో తిప్పలు (ప్రకాశం)

ఒంగోలు, సెప్టెంబర్ 12 (way2newstv.in): 
గతంలో వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకమో.. యాజమాన్య హక్కు పత్రమో.. దస్తావేజో ఉంటే చాలు తాను భూ యాజమానిగాఅన్నదాత గర్వపడేవాడు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వం రెవెన్యూలో పారదర్శక సేవలను అందించేందుకు వెబ్‌ల్యాండ్‌ను అమల్లోకి తెచ్చింది. చేతిలో ఎన్ని దస్త్రాలున్నా,పొలం సాగు చేసినా వెబ్‌ల్యాండ్‌లో పేరు ఉంటేనే రాయితీపై విత్తనాలు, ఎరువులు, వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు అందేది. ఒక వేళ మ్యుటేషన్‌ ద్వారా పట్టాదారు పాసుపుస్తకం పొందినా మూడోవంతు రైతులకు అడంగల్‌లో సవరణలు ఉంటున్నాయి. వాటిని సవరణ చేయాలంటే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసి నెల రోజుల్లో పని చేయించుకోవాలి. రెవెన్యూ సమస్యలు అంటేనే వాటిపరిష్కారం కోసం మండల తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాంటిది గత నెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అడంగల్‌ సవరణల నిమిత్తం వెబ్‌ల్యాండ్‌ను నిలిపేశారు. తద్వారాఆన్‌లైన్‌లో పేరు, విస్తీర్ణం నమోదుకు ఆటంకం ఏర్పడింది. దీంతో వ్యవసాయ సీజన్‌ సమీప వేళ బ్యాంకుల ద్వారా పంట రుణాల కోసం ప్రయత్నించే రైతులు నిస్సహాయ స్ధితిలో పడ్డారు. ప్రస్తుతంకొనుగోలు చేసిన, లేక వారసత్వంగా  సంక్రమించిన భూములున్న వారికి మ్యుటేషన్‌ ద్వారా మాత్రమే సేవలు లభిస్తున్నాయి.రైతులకు అనువంశికంగా లేదా కొనుగోలు ద్వారా వ్యవసాయ భూమి సంక్రమిస్తుంది. నాలుగేళ్ల కిందట రైతుల దగ్గర పట్టాదారు పాసుపుస్తకాలు అమల్లో ఉండేవి. నకిలీ పాసుపుస్తకాలను కట్టడిచేసేందుకు గత ప్రభుత్వ హయాంలో ఈ-పాస్‌ పుస్తకాలను అమల్లోకి తెచ్చారు.
తప్పులతో తిప్పలు (ప్రకాశం)

భూమి వారసత్వంగా వచ్చినా, కొనుగోలు చేసినా ఈ-పాస్‌ పుస్తకానికి దరఖాస్తు చేయాలి. తహసీల్దార్‌ అనుమతితో ఆపుస్తకాలు చెన్నైలో ముద్రణ జరిగి రైతుకు చేరేవి. వాటిలో పట్టాదారు(రైతు) పేరు, ఇంటి పేరు, విస్తీర్ణంలో తేడా, అనుభవ స్వభావం తదితరాలు నమోదవుతాయి. పొరపాటున లేదా నిర్లక్ష్యం కారణంగామీ సేవా కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వివరాలు తప్పుగా నమోదవడంతో భూముల సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. అలా నమోదైన వాటిలో 30 శాతం తప్పులు ఉంటున్నాయి. ఎక్కువసర్వే నంబర్ల విషయంలో రైతుకు ఎకరా పొలం ఉంటే 80 లేదా 90 సెంట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఎక్కించారు. మరికొన్ని కేసుల్లోనైతే ఓ రైతు విస్తీర్ణం, పక్క రైతు విస్తీర్ణంలో కలవడం; అసలుభూమికి సంబంధం లేని ఇతర పేర్లను వెబ్‌ల్యాండ్‌కి ఎక్కించేయడం వంటివి చోటు చేసుకున్నాయి. అనుభావ స్వభావం కొనుగోలు అయితే వారసత్వం; వారసత్వం అయితే కొనుగోలుగా నమోదుచేశారు. రైతులు బ్యాంకుల్లో తనఖా రుణాలకు వెళ్లిన సందర్భంలో బ్యాంకు అధికారులు ఆ భూమి కొనుగోలుకు సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు అడుగుతున్నారు. రెవెన్యూ విస్తీర్ణంలో తేడాలు ఉంటేరైతులు పొజిషన్‌ ధ్రువీకరణ పత్రం కోసం సర్వేకు దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదం అయినా సాంకేతిక కారణాల సవరణ నిమిత్తం రైతులు కాళ్లు అరిగేలా మండలతహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.ఏదో ఒక కారణంతో అన్నదాతల నుంచి అడంగల్‌ సవరణ నిమిత్తం జిల్లావ్యాప్తంగా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలకు దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ప్రతి మండలంలోనూ 200 నుంచి 500మంది వరకు అడంగల్‌ నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. 2017లో అప్పటి ప్రభుత్వ హయంలో ‘రైతు సేవలో రెవెన్యూశాఖ’ గ్రామసభలు నిర్వహించి అడంగల్‌ సవరణ బాధ్యతతహసీల్దార్లకు అప్పగించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మరోసారి రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా గత నెల 16 నుంచి రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణపేరుతో ఊరూరా గ్రామసభలు నిర్వహించింది. ఎక్కువగా అడంగల్‌ సవరణలపై దరఖాస్తులు అందాయి. అదే సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అడంగల్‌ సవరణలకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌నిలిపివేయడంతో రైతులకు కడగండ్లు మిగిలాయి. మరోవైపు పట్టాదారు పాస్‌ పుస్తకం ఆధారంగా భూముల వివరాలు ఆన్‌లైన్‌ చేయాలన్నా పని కావడంలేదు. బ్యాంకులు కూడా వెబ్‌ల్యాండ్‌వివరాలు పరిశీలించి పంట రుణాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో సాగు వేళ రైతుకు అప్పు పుట్టని పరిస్థితి ఎదురైంది. మరోవైపు వ్యవసాయ సీజన్‌ సమీపించడంతో వచ్చే నెల నుంచి రైతులుఎక్కువ విస్తీర్ణంలో శనగ సాగు చేయనున్నారు. సబ్సిడీపై విత్తనాలు పొందాలన్నా, వ్యవసాయ పరికరాలు మంజూరు కావాలన్నా భూములు ఆన్‌లైన్‌ కావాల్సిందే. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గతనాలుగేళ్లుగా పంట చేతికి అందక అప్పులు పాలైన రైతాంగానికి కీలకమైన సమయంలో వెబ్‌ల్యాండ్‌ నిలిపివేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment