Breaking News

14/09/2019

విమోచణ దినం అధికారికంగా జరపాలి

హైదరాబాద్,సెప్టెంబర్ 14, (way2newstv.in)
తెలంగాణ విమోచన దినోత్సవం ను ప్రభుత్వం అధికారికంగా జరుపాలని తెలంగాణ బీజేపీ కోరింది.  ఈమేరకు శనివారం పార్టీ నేతలు  గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ గత 20 సంవంత్సరాలుగా బీజేపీ దీనిపై పోరాడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు అధికారికంగా జరుపాలని కోరుకుంటుంన్నాయి...కానీ అధికారంలోకి వచ్చాక మర్చిపోతున్నాయని అన్నారు. మజ్లీస్ కు మిత్రులైన కాంగ్రెస్, టిఆర్ఎస్ లు అదే పని చేసాయి. అమరుల త్యాగాలను ఏందుకు చిన్న చూపు చూస్తున్నారు. 
విమోచణ దినం అధికారికంగా జరపాలి

గతంలో సీఎం గా రోశయ్య ఉన్నప్పుడు తెలంగాణ విమోచనం అధికరికంగా జరుపాలని డిమాండ్ చేసిన కేసీఆర్... ఇప్పుడు ఆయనే సీఎం గా ఉన్నాడు కదా..ఎంధుకు అధికారికంగా జరుపట్లేదని ప్రశ్నించారు. ఎంతో మంది త్యాగాల ఫలితమైన తెలంగాణ. తెలంగాణ లో  కేవలం కల్వకుంట్ల చరిత్ర మాత్రమే ఉండాలా అని అన్నారు. ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటె ఉద్యమం మరింత ఉదృతం చేస్తమని హెచ్చరించారు.  ఈ నెల 17న పఠాన్ చెరువు లో బీజేపీ భారీ బహిరంగ సభతో పాటు ఊరూరా జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు  బైక్ రాలీలు నిర్వహిస్తామని అన్నారు. మజ్లీస్ స్నేహం కోసమే కాంగ్రెస్ ,టిఆర్ఎస్ లు విమోచన దినోత్సవం గురించి మాట్లాడట్లేదని మండిపడ్డారు.

No comments:

Post a Comment