Breaking News

09/09/2019

స్పందన ఆర్జీలకు పరిష్కారం

ఒంగోలు, సెప్టెంబర్ 09,(way2newstv.in):
జిల్లాలో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల  నుండి వచ్చిన అర్జిల పట్ల సానుకూలంగా పరిష్కరించడా నికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్  అధికారులను ఆదేశించారు.  సోమవారం స్థానిక ప్రకారం  భవనంలోని కంట్రోల్ రూమ్ లో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా కలెక్టర్ నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పందన కార్యక్రమంలో   వచ్చిన అర్జీలను  వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 
 స్పందన ఆర్జీలకు పరిష్కారం

స్పందన కార్యక్రమం పట్ల అధికారులు స్పందన బాగుందని ఆయన అన్నారు. స్పంందన కార్యక్రమంలో వచ్చిన  అర్జీలను పరిశీలించి అర్ధవంతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అయన అన్నారు. స్పందన కార్యక్రమంలో, అర్ధవంతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. స్పందన కార్యక్రమంలో , మీసేవ కేంద్రాలలో ప్రజా సమస్యలు పట్ల వచ్చిన అర్జీలను ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.  జిల్లాలో  ఈ ,నెల 1వ తేది వరకు జరిగిన గ్రామ, వార్డు, సచివాలయ అభ్యుర్ధుల అర్హత పరీక్షలు లోపాలు లేకుండా సజావుగా జిల్లా  యంత్రంగం నిర్వహించినందుకు జిల్లా అధికారులకు కలెక్టర్  అభినందనలు  తెలియజేశారు. స్పందన కార్యక్రమంలో మద్దిపాడు  మండలం బసవన్న పాలేనికి చెందిన కొంగల ఝాన్సి, భర్త రమేష్ తన భర్త పేరున 2 సెంట్లు భూమిని ప్రభుత్వం వారు మంజూరు  చేసి ఆర్ధిక స్ధోమత లేక గృహాన్ని నిర్మించుకోలేక పోయామని, బసవన్నపాలేనికి చెందిన ఎ,అంజయ్య , తండ్రి  సోమయ్య అను వారు మాకు  చెందిన స్ధలాన్ని  ఆక్రమించుకొని ఉన్నారు అని  తెలియజేశామన్నారు.వేటపాలెం మండలం నాయనిపల్లి చెందిన షేక్ మల్లికా బేగం తన షేక్ భర్త కరీముల్లా 20.05.2017 న అనారోగ్యంతో మరణించారని తన జీవనం గడవడం  కష్టంగా వుందని వితంతు పింఛను మంజేరు చేయావలసిదిగి కోరారు. పామూరు మండలం మాలకొండాపురం గ్రామానికి చెందిన మాదాల పద్మ పతన భర్త కొండయ్య 10.60.2019 న అనారోగ్యం తో మరణించారని  తనకు ఎలాంటి ఆధారం లేదని వితంతు పించను  మంజూరు  చేయవలసినదిగా అర్జి ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్  ఎన్.షన్మోహన్, జిల్లా జాయింట్  కలెక్టర్ -2 గంగాధర్ గౌడ్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, సి.సి.ఓ.వెంకటేశ్వర్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎన్.ఇ.సంజివ రెడ్డి, వ్యవసాయ శాఖ  జె.డి శ్రీరామమూర్తి, పశు సంవర్ధక శాఖ  జెడి. శ్రీరవీంద్ర నాధ్ ఠాగుర్, డ్వామా పి.డి. శ్రీనా రెడ్డి, కృష్ణరావు, శ్రీనరసిహులు, డి.పిఓ నారాయణ రెడ్డి, కృష్ణ రావు, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment