Breaking News

06/09/2019

రాజధానిపై పునరాలోచనలో టీడీపీ....

విజయవాడ, సెప్టెంబర్ 6, (way2newstv.in)
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై పెద్దగా ఎవ‌రికీ ఆస‌క్తి లేదు. సాధార‌ణ ప్రజ‌ల మాట ఎలా ఉన్నప్పటికీ.. మ‌ధ్యతరగ‌తి ప్రజ‌లు మాత్రం అన్ని ప్రాంతాల‌ను అభివృద్ది చేయాల‌ని కోరుతున్నారు. కానీ, ప్రస్తుతం రాజ‌కీయంగా మాత్రం ఈ విష‌యం చాలా హాట్ హాట్‌గా మారుతోంది. ఏపీ సీఎం జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని త‌ల‌రిస్తున్నారంటూ .. పెద్ద ఎత్తున విప‌క్షాలు రచ్చ చేస్తున్నాయి. టీడీపీ, జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు కూడా ఈ ర‌చ్చకు తోడ‌య్యాయి. రాజ‌ధానిలో భూముల‌ను ఏ పార్టీ కోస‌మో ఇక్కడి రైతులు ఇవ్వలేద‌ని, ప్రభుత్వానికి ఇచ్చార‌ని, రాజు మారితే రాజ‌ధాని మారుతుందా ? అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.ఇక‌, రాజ‌ధానిని త‌ర‌లిస్తే.. ఊరుకునేది లేద‌ని, బీజేపీ టీడీపీలు కూడా సంయుక్తంగా గ‌ళం వినిపిస్తున్నా యి. 
రాజధానిపై పునరాలోచనలో టీడీపీ....

ఐదు కోట్ల ప్రజ‌ల ఆశ‌ల‌ను జ‌గ‌న్ వ‌మ్ము చేస్తున్నార‌ని, అక్కడ అవినీతి, అక్రమాలు జ‌రిగితే.. విచారణ చేసుకోవ‌చ్చని, కానీ, రాజ‌ధానిని నిలిపివేయ‌డం స‌మంజ‌సం కాద‌ని గ‌ళం వినిపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్టాల‌నే క్రతువుకు వీరు మొగ్గు చూపుతున్నారు. అయితే, అస‌లు వీరంతా రాష్ట్ర ప్రజ‌ల మ‌న‌సులో ఏముందో ప‌ట్టి చూశారా? అనేది ప్రధాన ప్రశ్న.ఇక్కడి ప్రజ‌ల మ‌నోభావాలు ఎలా ఉన్నాయి ? వారు ఎలా ముందుకు సాగుతున్నారు ? ఏయే ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌ని కోరుతున్నారు? అనే విష‌యాల‌ను విస్మరించి.. పార్టీలు ఎవ‌రి ఆధిప‌త్యం కోసం వారు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. నిజానికి రాష్ట్రం మూడు ప్రాంతాలుగా ఉంది. ఉత్తరాంధ్ర, రాయ‌ల‌సీమ‌, కోస్తా ఆంధ్ర. వీటిలో రెండు ప్రాం తాలు ఉత్తరాంధ్ర, రాయ‌ల‌సీమ‌లు అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం ఇక్కడి ప్ర‌జ‌లు క‌దం తొక్కుతున్నారు.ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ కూడా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ కూడా ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల‌పై దృష్టి పెట్టారు. అయితే, రాజ‌ధాని అమ‌రావ‌తిని ఆపేస్తాన‌ని ఆయ‌న చెప్పలేదు. కేవ‌లం అక్కడ కొన్ని విభాగాల‌ను తీసి.. ఇత‌ర జిల్లాల్లో ఏర్పాటు చేయ‌డం ద్వారా అంద‌రినీ అభివృద్ధి చేయాల‌ని చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌పై జ‌గ‌న్ ప్రధానంగా దృష్టి సారించ‌నున్నారు. కానీ, దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకురాజ‌కీయ నాయ‌కులు చ‌ర్చ చేస్తున్నారు. మ‌రి ఇది ఎప్పటికి లైన్‌లో ప‌డుతుందో చూడాలి.

No comments:

Post a Comment