Breaking News

28/09/2019

సామాన్యుడికి భారంగా మారుతున్న ధరలు

మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడ పదాటలేదంటారు. ధరల నియంత్రణ విషయంలో కేంద్ర,రాష్ట్ర పాలకులు వ్యవ హరిస్తున్న తీరు అందుకు అద్దంపడుతున్నది. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టడంలో పాలకులు చెప్తున్న మాటలకు, ఆచరణకు తనలేకుండాపోతున్నది. ఉన్న చట్టాల్లో స్పష్టత లేదు.ఆ చట్టాలను కూడా త్రికరణశుద్ధిగా అమలు చేయించే సత్తా పాలకులకు లేదేమోననిపిస్తున్నది. అన్నింటికంటే మించి వారు ఇచ్చిన ఆదేశాలను, అమలు చేయాలనే చిత్తశుద్ధి అధికారయంత్రాంగానికి లేదు. అందుకే ధరలు అదుపు లేకుండాపెరిగిపోతున్నాయి. నియంత్రించే పరిస్థితులు కన్పించడం లేదు. ఒకవేళ ఆదేశించినా, చర్యలు తీసుకున్నా అవి అమలు అవ్ఞతాయనేది అను మానమే. అయితే రైతుల వద్ద ఉత్పత్తులు ఉన్నంతకాలం తగ్గి ఉన్న ధరలను తాము అదుపు చేసినట్లు అధికార వర్గాలు చెప్పుకుంటాయి. 
సామాన్యుడికి భారంగా మారుతున్న ధరలు

రైతుల గడప దాటి ఉత్పత్తులు బయటికి వెళ్లిన మరుక్షణం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదేదో కొత్తగా ఆరంభమైంది కాదు.రైతుల వద్ద ఉత్ప త్తులు ఉన్నంతకాలం ఒక వ్యూహం ప్రకారం కొందరు బడావర్తకులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను వారు అనుకున్నట్లు నియంత్రించగలుగుతున్నారు. ప్రస్తుతం ఒక్క సారిగా పెరిగిన ఉల్లిధరనే తీసుకుందాం. నిన్నమొన్నటి వరకు కిలో పది, పదిహేను రూపాయలున్న ఉల్లి నేడు అరవై రూపాయలకు దాటిపోయింది. ఈసారి ఖరీఫ్‌లో ఉల్లి దిగుబడులు బాగానే ఉంటాయని ఆశించారు. కానీ గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంట దెబ్బతిన్నది. దీనికితోడు చీడపీడలు కూడా పెద్దఎత్తునే ఆశించాయి. మొత్తం మీద దిగుబడులు కొంత మేరకు తగ్గాయిరైతులు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమోనని, తమవద్ద ఉన్న నిల్వలను అమ్ముకున్నారు. రైతుల వద్ద నుంచి దళారుల గోదాముల్లోకి ఈ ఉల్లిగడ్డలు తరలిపోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెంచారు. ఇప్పుడు అమ్ముకున్న రైతులు లబోదిబోమంటున్నారు. వినియోగ దారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇది ఒక్క ఉల్లి విషయంలోనే కాదు. ఏ పంటను తీసుకున్నా ఇదే పరిస్థితి. మొన్న కందిపప్పు, అంతకుముందు వేరుశనగ, మిర్చి పరిస్థితి కూడా అలాగే ఉండబోతుందంటున్నారు. వ్యవసాయాన్ని ఒక జూదంగా తయారు చేశారేమోననిపిస్తున్నది. వాస్తవంగా ఉల్లికి ఇలాంటి పరిస్థితి లేదు.మనదేశంలో పండకపోయినా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో ఉల్లిపంట సాగుచేస్తున్నారు. దిగుబడుల్లో దాదాపు సగం వాటా చైనా, భారత్‌దే. దిగుబడుల్లో రెండోస్థానంలో ఉన్న భారత్‌ ఉత్పాదకతలో మాత్రం 90వ స్థానంలో ఉంది. హెక్టారుకు పండే పంట లెక్కనే ఉత్పాదకత అంటారు. ఈ విషయంలో ఐర్లాండ్‌ ఒక హెక్టారులో 67.33 టన్నులతో అగ్రస్థానంలో ఉంటే మనదేశంలో రైతులు 14.53 టన్నులకు మించి పండించలేకపోతున్నారు. దేశంలో ప్రస్తుతం తలసరి వార్షిక ఉల్లి వినియోగం దాదాపు ఏడు కిలోలని జాతీయ ఉల్లి, అల్లం పరిశోధన సంస్థ గతంలో వెల్లడించింది. దేశజనాభాలో 2050 నాటికి 170 కోట్లకు చేరుతుందని, అప్పటికి తలసరి వినియోగం 11.60 కిలోలకు చేరుకుంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. కానీ పంటవిస్తీర్ణం అందుకు అనుగుణంగా పెరిగే అవకాశం కన్పించడం లేదు. ఏటా మన అవసరాలు తీరాలంటే దాదాపు మూడుకోట్ల టన్నుల ఉల్లిపాయలు మన రైతులు పండించాలి. ఉత్పాదకత రేటు కూడా 21 టన్నులకు చేరాలి. కానీ ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఆ దిగుబడులు వచ్చే అవకాశాలు కనుచూపు మేరల్లో కన్పించడం లేదు. అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి.అక్కడ దీర్ఘకాలంగా సాగుచేసే హైబ్రిడ్‌ విత్తనాలను తక్కువ ధరలకే రైతులకు అందిస్తున్నారు. పైగా ఆధునిక యంత్రాల వినియోగంతో సాగు చేయడం, శుభ్రం చేయడం అన్నింటి కంటే ముఖ్యంగా కోత అనంతరం వృధా గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. ఫలితంగా దిగుబడుల వైపు ముందుకు అడుగు వేస్తున్నారు. కానీ భారత్‌లో పురాతన సంప్రదాయ పద్ధతుల్లో పండించడంతోపాటు కోత అనంతరం జరుగుతున్న వృధా ఇరవై శాతానికిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏటా మూడు సీజన్‌లలో ఉల్లిసాగు అవ్ఞతుంది. మొన్న ఏప్రిల్‌లో వేసిన పంట జూన్‌ నెలాఖరున మార్కెట్లోకి వచ్చింది. అప్పటికే దేశవ్యాప్తంగా ఉల్లి నిల్వలున్నాయి.కానీ ఇతర ప్రాంతాల నుంచి దిగుబడులు కూడా బాగానే ఉన్నాయి. అసలు ఈ ఉల్లి మార్కెట్‌కు మహారాష్ట్రలోని లాసల్‌గాంవ్‌ దేశంలోనే టోకు వ్యాపారంలో అతిపెద్దది. అక్కడి నుంచే సాధ్యమై నంతవరకు ఈ వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు. కృత్రిమకొరత సృష్టించడం, డిమాండ్‌ పెంచి ధరలను తమ ఇష్టానుసారంగా నిర్ణయించి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇది ఇప్పటికిప్పుడు ప్రారంభం కాలేదు. ఒక్క ఉల్లిపంటకే పరిమితం కాదు. అన్ని పంటల్లోనూ దళారులు ఈ వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. పాలకులకు తెలియంది కాదు.అయినా ప్రేక్షకపాత్రవహిస్తున్నారు. అయితే గతంలో ఒకటి,రెండుసార్లు ఈ ధరలను నియంత్రించేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ప్రభుత్వమే నేరుగా వివిధ ప్రభుత్వరంగ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి,నిల్వలు ఉంచి మార్కెట్లోకి పంపడం ద్వారా నియంత్రించగలిగింది. కానీ నిర్వహణ లోపంతో పెద్దఎత్తున నష్టాలు ఎదుర్కొనాల్సివచ్చింది.వాస్తవంగా చూస్తే ఇటు ధరలను అదుపు చేసి అదే సమయంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర అందించి మరొకపక్క పేద,బడుగు వర్గాలకు నిత్యావసర వస్తువ్ఞలు సబ్సిడీ కింద అందించే ఉద్దేశంతో దాదాపు 140 ఏళ్ల క్రిందనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా అదే ప్రజాపంపిణీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. కానీ ఆ వ్యవస్థను రాజకీయ జోక్యంతో క్రమేణా నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. ఫలితంగా ధరలను నియంత్రించేవారు కరవైపోయారు.

No comments:

Post a Comment