Breaking News

18/09/2019

ఓనర్ షిప్ పై క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్

హైద్రాబాద్, సెప్టెంబర్ 18, (way2newstv.in)
టీఆర్ఎస్ కి సోలో ఓనర్ కేసీఆర్ ఇప్పట్లో నాటౌట్ అంటున్నారు. మరో పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని భారీ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. నిజానికి ఇది రాజకీయంగా ప్రకంపనలు రేపే ప్రకటనగానే చూడాలి. పైగా ప్రస్తుత సమయంలో కేసీఆర్ చేసిన ఈ ప్రకటనకు ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉందని కూడా అంటున్నారు. ఓ వైపు తెలంగాణాలో కుర్చీ మీద కన్నేసిన బీజేపీ ఉంది. మరో వైపు సొంత పార్టీలో కొడుకు కేటీయార్, మేనల్లుడు హరీష్ రావు ల మధ్య బయటకు కనబడని పోరు ఉంది. కాబోయే సీఎం లుగా రెండు వైపుల నుంచి పేర్లూ, నినాదాలు వినిపిస్తున్నాయి. 
ఓనర్ షిప్ పై క్లారిటీ ఇచ్చేసిన కేసీఆర్

ఇటువంటి నేపధ్యంలో కేసీఆర్ చేసిన ప్రకటన జాతీయ రాజకీయాల్లోనూ చర్చగా ఉంటుందన్నది వాస్తవం.కేసీఆర్ ఏ ప్రకటన చేసినా పైకి బోళాతనంగా అన్నట్లుగా కనిపిస్తుంది కానీ దాని వెనక పెద్ద వ్యూహం ఉంటుందని కూడా అంటారు. తాజా ప్రకటన కూడా అలాగే చూడాలి. టీయారెస్ లో గొడవలు, పార్టీ చీలిపోతుంది, అందువల్ల ఆ రాజకీయ ఖాళీని పూరించి అందలం ఎక్కాలని బీజేపీ ఓ వైపు పధక రచన చేస్తోంది. ఇక పార్టీలో కేసీఆర్ తరువాత బలమైన మాస్ నేతగా హరీష్ రావు ఉన్నారు. కేటీయార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా కూడా హరీష్ కి అటు జనంలో, ఇటు పార్టీలో కూడా మార్కులు కొంచెం ఎక్కువ పడుతున్నాయి. ఈ సంగతి గ్రహించే కేసీఆర్ ఆయన్ని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. హరీష్ రావు అయినా మరొకరు అయినా కూడా కేసీఆర్ ఉన్నంతవరకూ నోరెత్తే సాహసం చేయలేరు. ఒకవేళ అయ‌న ఫలనా వారు నా వారసులు అన్నపుడే అసలు తంటా మొదలవుతుంది. ఇది గ్రహించే కేసీఆర్ ఇపుడు ఇద్దర్నీ కొన్నాళ్ల పాటు తన మంత్రులుగానే ఉండనిస్తున్నారు.ఇదిలా ఉండగా 2019 ఎన్నికలను కేసీఆర్ వేరే విధంగా అంచనా వేసుకున్నారు. కేంద్రంలో సంకీర్ణం వస్తుందని, తన ఎంపీలతో ఢిల్లీ వెళ్ళి చక్రం తిప్పవచ్చునని కూడా భావించారు. ఇపుడు అది రివర్స్ అయింది. మోడీ బలమైన నేతగా జాతీయ స్థాయిలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. ఇక బీజేపీకి తెలంగాణాలో వచ్చిన నాలుగు ఎంపీ సీట్లతో బాగానే దూకుడు పెంచుతోంది. దాని నుంచి కాచుకునేందుకు కేసీఆర్ తన ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. మేనల్లుడు హరీష్ తన పక్కన ఉంటే ఎంతమంది నేతలు నోరెత్తినా అది కుదిరే పని కాదని భావించి ఆయన్ని మంత్రి పదవితో కట్టిపడేశారు.ఇక జమిలి ఎన్నికలు అంటూ జరిగితే 2022లో వస్తాయి. దాన్ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం. ఒకవేళ అలా కాకపోతే 2023లో షెడ్యూల్ ప్రకారం తెలంగాణా ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో పార్టీని గెలిపించి తాను రిటైర్ కావలని మొదట కేసీఆర్ అనుకున్నారు. కానీ ఇపుడు మాత్రం మోడీ రిటైర్మెంట్ తో దానికి ముడి పెట్టారు. 2025 నాటికి మోడీకి 75 ఏళ్ళు వస్తాయి. ఆయన పెట్టిన నిబంధన ప్రకారం బీజేపీ నుంచి తప్పుకుంటారని అంటున్నారు. అలా మోడీ రాజకీయాల నుంచి రిటైర్ అయిన తరువాతనే కేసీఆర్ కూడా సీఎం కుర్చీ ఖాళీ చేస్తారని తాను కోరుకున్న వారసులకు అప్పగిస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ 2029 వరకూ తాను రిటైర్ కానూ అంటూ చేసిన ప్రకటన పార్టీలోని అసమ్మతివాదులకు, బయట పొంచి ఉన్న బీజేపీకి కూడా పెను సవాల్ అంటున్నారు.

No comments:

Post a Comment