జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి , సెప్టెంబర్ 18 (way2newstv.in)
స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ లో పెద్దపల్లి జిల్లా మరోసారి ప్రథమ స్థానం సాధించాలని, దీని కోసం స్మార్ట్ ఫోన్ కల్గిన ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను ఎస్ ఎస్ జీ 2019 యాప్ తెలియజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన కోరారు. ఎస్ ఎస్ జీ 2019 యాప్ డౌన్లోడ్ , స్వచ్చత అంశంలో జిల్లా సాధించిన ప్రగతిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తూ ఫీడ్ బ్యాక్ అందించడానికి కలెక్టర్ బుధవారం జిల్లాలోని పలు ప్రజాసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో పర్యటించారు. జిల్లాలోని బ్యాంకులు, అయ్యప్ప మందిరం, జేండా చౌరస్తా, ధర్మారం క్రాస్ రోడ్డు మొదలగు ప్రదేశాలలో కలెక్టర్ పర్యటిస్తూ ప్రజల చే ఎస్ ఎస్ జీ 2019 యాప్ ను డౌన్ లోడ్ చేయించి ఫీడ్ బ్యాక్ అందించారు. జిల్లాలో మనం ఇప్పటి వరకు 1,15,000 మంది కంటే ఎక్కువ మందితో యాప్ డౌన్లోడ్ చేయించి ఫీడ్ బ్యాక్ అందించామని అన్నారు.
స్వచ్చ్ సర్వేక్షణ్ లో మరో మారు ప్రథమ స్థానం సాధించాలి
రాష్ట్రంలో ఎస్ ఎస్ జీ 2019 యాప్ ల ద్వారా ఫీడ్ బ్యాక్ అందించడంలో పెద్దపల్లి జిల్లా ముందు వరుసలో ఉందని, మనం మరింత చిత్తశుద్దీతో ప్రయత్నిస్తే మనం ప్రథమ స్థానంలో ఉంటామని, ఫీడ్ బ్యాక్ అందించడానికి సెప్టెంబర్ 22,2019 వరకు అవకాశం ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జిల్లా అధికారులు, వారి సిబ్బంది జిల్లాలోని జనసంచారం అధికంగా వుండే మార్కెట్లు, షాపుల వద్ద ఉండి ప్రజల చే ఎస్ ఎస్ జీ 2019 యాప్ ను డౌన్లోడ్ చేయించి సరైన ఫీడ్ బ్యాక్ అందిస్తున్నారు, ముఖ్యమైన కూడళ్ల వద్ద మండల కేంద్ర పరిసర ప్రాంతాల్లో వచ్చే వారితో కూడా ఎస్ ఎస్ జీ 2019 యాప్ ను డౌన్లోడ్ చేయించి ఫీడ్ బ్యాక్ అందించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలోని ప్రజలు సహకరించి వారి స్మార్ట్ ఫోన్ల నుండి కచ్చితంగా ఎస్ ఎస్ జీ 19 యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఫీడ్ బ్యాక్ అందించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.అయ్యప్ప మందిరం వద్ద ఎస్ ఎస్ జీ 2019 యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్న సమయంలో అక్కడ హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలను నడుపుతున్న వాహనదారులకు జిల్లా ట్రాఫీక్ విభాగం వారు అందిస్తున్న హెల్మెట్లను కలెక్టర్ అందజేసారు. ట్రాఫీక్ నియమాలను అందరు పాటించాలని, తప్పనిసరిగ్గా భవిష్యత్తులో హెల్మెట్ వినియోగించాలని కోరారు. అదే సమయంలో హెల్మెట్ ధరించని వారిని గుర్తించి వారికి జరిమానా విధించకుండా నూతన హెల్మెట్ లను కోనుగోలు చేయిస్తున్న ట్రాఫీక్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
No comments:
Post a Comment