సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలి
హరిత తెలంగాణ కోసం అందరూ పాటుపడాలి
తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన టిఎస్ టిఎస్ చైర్మన్
పెద్దపల్లి సెప్టెంబర్ 13 (way2newstv.in)
తెలంగాణ కు హరితహారం లో భాగంగా పెద్దపల్లిలోని తన ఇంటి ఆవరణలో టిఎస్ టిఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ చిరుమిల్ల మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి మొక్కలు నాటివాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మొక్కలు నాటాలని కోరారు.
మొక్కలు నాటి,వాటిని సంరక్షించడం బాధ్యతగా భావించాలి
భావి తరాలకు మనం పచ్చదనంతో ఆరోగ్యంఅందివ్వాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలు స్పూర్తిగా తీసుకొని అందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేసారు.హరిత తెలంగాణ కోసం అందరూ పాటుపడాల్సినఅవసరముందన్నారు.పెద్దపల్లి జిల్లా యువతకు ఈ సందర్భంగా ఆయన గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
No comments:
Post a Comment