Breaking News

04/09/2019

నిండుకుండలా రాజన్న జలాశయం

రాజన్నసిరిసిల్లా ఆగస్టు 31, (way2newstv.in)
జిల్లాలోని  మిడ్ మానేర్ శ్రీ రాజరాజేశ్వర జలాశయం నిండుకుండలా మారింది. తొలిసారి ప్రాజెక్టులోకి 15 టీఎంసీల నీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తారు. ఐదు గేట్లను ఎత్తి దిగువ మానేరు లోకి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఈఎన్ సి అనిల్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. దశలవారీగా నీటి విడుదలను పెంచుతామని ఈఎన్సీ అనీల్ కుమార్ తెలిపారు. 
నిండుకుండలా  రాజన్న జలాశయం

మిడ్ మానేర్ లోకి నిర్దేశించిన నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి లోయర్ మానేర్ డ్యాం కు పంపిస్తున్నామని చెప్పారు. మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తైన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తో గోదావరి జలాలతో నింపుతున్నారు. 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్ మానేరు లో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు చేరింది.  తొలిసారి గేట్లు ఎత్తడంతో డ్యాం వద్ద ఎస్పీ రాహుల్ హెగ్డేఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment