Breaking News

11/09/2019

సిటీ క్రెడిట్ కార్డుతో ఏడాదికి 71 లీటర్ల ఉచితం..

చెన్నై, సెప్టెంబర్ 11, (way2newstv.in)
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీకు రివార్డు పాయింట్లు/క్రెడిట్ పాయింట్ల గురించి తెలిసే ఉంటుంది. ఒక్కో కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఒక్కో రకమైన పాయింట్లను అందిస్తాయి. వీటిని మనందేనికైనా ఉపయోగించొచ్చు. ఐఆర్‌సీటీసీ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డుతో పాయింట్ల ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.దీనిమాదిరే కొన్ని కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో పెట్రోల్ ఉచితంగా కొట్టించుకోవచ్చు.బ్యాంకులు ఫ్యూయెల్ రిటైలర్లతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. సిటీ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కంపెనీ కలిసి కస్టమర్లకు ఒక క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తున్నాయి.
సిటీ క్రెడిట్ కార్డుతో ఏడాదికి 71 లీటర్ల ఉచితం..

దీని ద్వారా కస్టమర్లు ఏడాదికి 71 లీటర్ల ఉచిత ఫ్యూయెల్ పొందొచ్చు. దీని పేరు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు.ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో ఈ కార్డు ద్వారా రూ.150 ఖర్చు చేస్తే 4టర్బో పాయింట్లు లభిస్తాయి. ఒక టర్బో పాయింట్ ఒక రూపాయితో సమానం. అలాగే ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు కూడా ఉంది.ఫ్యూయెల్ మాత్రమే కాకుండా గ్రాసరీ స్టోర్లు, ఇతర సూపర్మార్కెట్లలో కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపితే ప్రతి రూ.150పై 2 టర్బో పాయింట్లు పొందొచ్చు. అలాగే మీరు ఏడాది కాలంలో రూ.30,000 కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంఉండదు. అంటే కార్డును ఉచితంగానే వాడొచ్చు. లేదంటే సంవత్సరానికి రూ.1,000 ఫీజు చెల్లించాలి.ఇకపోతే రూ.10,000 వరకు లావాదేవీలకు మాత్రమే టర్బో పాయింట్లు వస్తాయి. ఆటుపైన ఖర్చు చేసిన డబ్బుకు ఎలాంటి పాయింట్లు ఉండవు. అలాగే ఒక నెలలో రూ.5,000 వరకు ఖర్చుకుమాత్రమే రూ.150కి 2 టర్బో పాయింట్లు వస్తాయి. అదే ఆపైన ఖర్చు చేస్తే రూ.150కి ఒక టర్బో పాయింట్ మాత్రమే వస్తుంది.

No comments:

Post a Comment