Breaking News

09/09/2019

కోటి 50 లక్షలకు రవి శాస్త్రీ జీతం

ముంబై, సెప్టెంబర్ 9 (way2newstv.in)
భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికి రూ. కోట్లలో జీతాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెల్లిస్తోంది. ఇటీవల రెండో పర్యాయం హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. 2021లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకూ పదవిలో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో.. అతని జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.ఓ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రవిశాస్త్రి‌కి ప్రస్తుతం ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. 
కోటి 50 లక్షలకు రవి శాస్త్రీ జీతం

తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల మేర పెరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. వన్డే ప్రపంచకప్‌ ఓటమి నేపథ్యంలో.. రవిశాస్త్రిపై వేటు పడుతుందని అంతా ఊహించారు. కానీ.. అనూహ్యంగా.. మళ్లీ అతడినే కోచ్ పదవి వరించింది.ఆస్ట్రేలియా గడ్డపై ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత గత ఏడాది టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండేళ్లలో విదేశాల్లోనూ భారత్ జట్టు సత్తాచాటడం, టీమిండియా ఆటగాళ్లతోనూ రవిశాస్త్రికి సత్సంబంధాలు ఉండటం అతనికి కలిసొచ్చింది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనని అజేయంగా ముగించిన భారత్ జట్టు.. ఈనెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడబోతోంది.

No comments:

Post a Comment