Breaking News

23/09/2019

40 వేల దగ్గరలో సెన్సెక్స్

ముంబై, సెప్టెంబర్ 23, (way2newstv.in)
కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో పాటు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలతో స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న జోష్‌ సోమవారం కూడా కొనసాగింది.  ఫార్మా, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌,  ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌,  ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి షేర్లు భారీగా లాభపడ్డాయి. 
40 వేల దగ్గరలో సెన్సెక్స్

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1075 పాయింట్ల లాభంతో 39,090 పాయింట్ల వద్ద ముగియగా, 329 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,603 పాయింట్ల వద్ద క్లోజయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో సత్తా చాటుతున్న స్టాక్‌ మార్కెట్లలో ఈ ఉత్సాహం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సానుకూల రుతుపవనాలు సైతం వృద్ధి రేటుపై ఆశలు పెంచుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.

No comments:

Post a Comment