Breaking News

25/09/2019

ఏపీలో అమల్లోకి వచ్చిన 3 బాటిల్స్ నిబంధన

హైద్రాబాద్, సెప్టెంబర్ 25, (way2newstv.in)
ఏపీలో మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ మద్యనిషేధంలో భాగంగా మరో ఉత్తర్వు జారీ చేసింది. ఒక వ్యక్తి దగ్గర పరిమితికి మించి మద్యం బాటిళ్లు కలిగి ఉండరాదని ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో వ్యక్తి దగ్గర 3 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు తీసుకుంటారు. 
ఏపీలో అమల్లోకి వచ్చిన 3 బాటిల్స్ నిబంధన

మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.విడతల వారీగా సంపూర్ణ మద్యపానం నిషేధమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది. ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పర్యవేక్షణ ఉంటుంది. సర్కారీ మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్ లు ఉండవు. రోడ్డుపై మద్యం సేవిస్తే శిక్షిస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment