Breaking News

07/09/2019

19 తర్వాత తెలంగాణ ఆర్టీసీ సమ్మె

హైద్రాబాద్, సెప్టెంబర్ 7, (way2newstv.in)
తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈనెల 19 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. ఆర్టీసీ పరిరక్షణ, పేస్కేలుఅమలు, బడ్జెట్‌లో కనీసం ఒక్క శాతం నిధులు, ఐదేళ్ల లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్‌, ఆరు నెలల డిఎ పాతబకాయిల చెల్లింపు సహా 35 డిమాండ్లను పరిష్కరించాలని టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ డిమాండ్చేసింది. 
19 తర్వాత తెలంగాణ ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ అభివృద్ధి కోసం చాలా చేస్తామని హామీలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని వారు మండిపడ్డారు. ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్‌ ద్వారా నిధులు ఇస్తామని, సంస్థ ఆప్పుల భారాన్ని తగ్గిస్తామని, బస్సుల కొనుగోలుకు నిధులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, సంస్ధను నిర్వీర్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.సీసీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఆ సొమ్మును ఇవ్వనందువల్ల దాదాపు 9వేల మంది కార్మికుల లోన్‌ ఆప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

No comments:

Post a Comment