Breaking News

04/09/2019

డయల్ - 100 , పోలీసు వాట్సాప్ నంబర్ 9989819191లకు సమాచారమివ్వండి

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు
అనంతపురం, సెప్టెంబర్ 04  (way2newstv.in)
 అనంతపురం సబ్ డివిజన్ పరిధిలోని ఓ యువకుడు కుటుంబ కలహాలుతో జీవితంపై విరక్తి చెంది సూపర్ వాస్మోల్ తాగాడు. స్థానికులు డయల్ - 100 కు ఈ సమాచారాన్ని చేరవేశారు. వెంటనే బ్లూకోల్ట్స్ మరియు సంబంధిత పోలీసు సిబ్బందిని డయల్ - 100 సిబ్బంది అప్రమత్తం చేశారు. హుటాహుటిన అక్కడికెళ్లి ఆ యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. జిల్లాలో పోలీసులు డయల్ - 100 కు తక్షణమే స్పందించి సేవలు అందిస్తుండటానికి గత నెలలో జరిగిన ఈ ఘటన మచ్చుకు మాత్రమే. ఆత్మాహత్యాయత్నాలు, రోడ్డు ప్రమాద క్షతగాత్రుల ప్రాణాలు కాపాడటం, మట్కా పేకాటలపై దాడులు, ఈవ్ టీజింగ్ , బాడిలీ అఫెన్సెస్ ను అరికట్టడం, తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించడం... 
డయల్ - 100 , పోలీసు వాట్సాప్ నంబర్ 9989819191లకు సమాచారమివ్వండి

ఇలా జిల్లాలో పోలీసులు ఎన్నో ప్రజోపయోగ సేవలు అందించారు. గతనెలలో జిల్లా నుండీ డయల్ - 100 , పోలీసు వాట్సాప్ 9989819191 నంబర్లకు వచ్చిన కాల్స్ ... పోలీసుల స్పందన, పనితీరుపై ఎస్పీ సమీక్షించి ఆ గణాంకాలను వెల్లడించారు.
 జిల్లా నుండీ డయల్ - 100 కు 1350 కాల్స్ 
జిల్లా నుండీ గత నెలలో డయల్ - 100 కు 1350 కాల్స్ వెళ్లాయి. ఈకాల్స్ అన్నింటికీ పోలీసులు తక్షణమే స్పందించారు. జిల్లాలో ప్రతీ కాల్ కు సరాసరి 7 నిముషాల 10 సెకన్లు  రెస్పాన్స్ టైంగా నిర్ధేశించుకుని బాధిత ప్రజలకు సేవలందించారు.
 49 మంది రోడ్డు ప్రమాద క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన జిల్లా పోలీసులు 
 జిల్లాలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాల ఘటనల్లో 49 మంది క్షతగాత్రుల ప్రాణాలను జిల్లాలోని ఆయా పోలీసులు, రోడ్డు సేప్టీ విభాగం పోలీసులు కాపాడారు. రోడ్డు ప్రమాదం జరిగిన కొన్ని నిముషాల్లో చేరుకోవడం వెంటనే ఆ క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించి సేవలందించారు. 
 నలుగురి ఆత్మహత్యాయత్నాలు నిలువరింపు... 
వివిధ కారణాలుతో జీవితంపై విరక్తి చెంది జిల్లాలో వేర్వేరుగా ఆత్మహత్యాయత్నం చేసిన నలుగుర్ని బ్లూకోల్ట్స్ సిబ్బంది మరియు సంబంధిత పోలీసులు కాపాడారు. అనంతపురం రెండవ పట్టణం, రాప్తాడు, గోరంట్ల, పరిగి పోలీసు స్టేషన్ల పరిధుల్లో జరిగిన ఈ ఘటనల్లో అభినందనీయమైన సేవలందించారు. 
 తప్పిపోయిన నలుగురు చిన్నారుల అప్పగింత 
 జిల్లాలోని రాప్తాడు, అనంతపురం నాల్గవ పట్టణం పోలీసు స్టేషన్ల పరిధుల్లో వేర్వేరు సందర్భాలలో తప్పిపోయిన నలుగురు చిన్నారులను ఆయా తల్లిదండ్రులకు అప్పగించారు. 
బాడిలీ అఫెన్సెస్ పై చర్యలు
జిల్లాలోని అనంతపురం నాల్గవ పట్టణం, మూడవ పట్టణం, కళ్యాణదుర్గం, అగిళి, పరిగి పోలీసులు సంబంధిత బ్లూకోల్ట్స్ విభాగం సిబ్బందితో కలసి ఐదు బాడిలీ అఫెన్సెస్ పై పక్కాగా చర్యలు తీసుకున్నారు. ఈ ఐదు ఘటనలుపై కేసులు నమోదు చేయడమే కాకుండా తీవ్రం కాకుండా సద్దుమణిచారు. 
 మట్కా, పేకాట, ఈవ్ టీజింగ్ లపై చర్యలు
జిల్లాలో మట్కా, పేకాటలపై చర్యలు తీసుకున్నారు. కసాపురం, ధర్మవరం పట్టణం, అనంతపురం ఒకటవ పట్టణం, మడకశిర పోలీసులు పేకాట ఆడుతున్న  26 మందిని అరెస్టు చేసి రూ. 31,260/- లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనంతపురంలో ఇద్దరు ఈవ్ టీజర్లను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు.
బెల్టు దుకాణాలుపై దాడులు
బత్తలపల్లి, తాడిపత్రి రూరల్ ,పుట్టపర్తి రూరల్ , రాయదుర్గం పోలీసులు బెల్టు దుకాణాలుపై దాడులు చేసి ుడు కేసులు నమోదు చేసి ముగ్గుర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ 35 మద్యం బాటిళ్లు, రెండు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment