నెల్లూరు, ఆగస్టు 20 (way2newstv.in - Swamy Naidu):
ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2విజయంలో మంగళవారం మరో దశను పూర్తి చేసుకుంది. చంద్రుడి మీదే అందరు దృష్టి పెట్టారు. చంద్రయాన్2కు చెందిన విక్రమ్ ల్యాండర్.. వచ్చే నెలలో చంద్రుడి దక్షిణ ద్రువంపై దిగనున్నది. వివిధ దేశాలు, స్పేస్ సంస్థలు ఎందుకు చంద్రుడి దక్షిణ ద్రువాన్ని టార్గెట్ చేశాయన్న అంశాన్ని ఇస్రో వివరించింది. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేసింది. చంద్రుడి దక్షిణ ద్రువంలో ఉన్న అనేక అగాధాలు వేల కోట్ల ఏళ్ల నుంచి సూర్యుడి కాంతిని నోచుకోలేదు. ఈ కారణంగా అక్కడ సౌర వ్యవస్థ ఆవిర్భావానికి చెందిన అనేక విశ్వ రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ ద్రువంపై ఉన్న లోయల్లో కొన్ని వందల మిలియన్ల టన్నుల నీరు ఉంటుందని ఆశిస్తున్నారు. జీవాధారానికి నీరే ప్రదానం కాబట్టి.. ఈ కోణంలోనూ పరీక్షలు జరుగుతున్నాయి.
మరో దశను పూర్తి చేసుకున్న చంద్రయన్
దక్షిణ ద్రువంపై ఉన్న రాళ్లలో అనేక ఖనిజాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హైడ్రోజన్, అమోనియా, మీథేన్, సోడియం, మెర్క్యూరీ, సిల్వర్ లాంటి విలువైన ఖనిజాలు ఉన్నట్లు గుర్తిస్తున్నారు. భవిష్యత్తు ప్రయోగాలు, రోదసి అన్వేషణల కోసం చంద్రుడి దక్షిణ ద్రువం అనువైన ప్రాంతమని ఇస్రో భావిస్తున్నది. చంద్రుడి చుట్టూ ఉన్న ల్యానార్ ఆర్బిట్‌లోకి దూసుకెళ్లింది. ఉదయం 9గంటల 2నిమిషాలకు కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. 29 రోజుల నిరీక్షణకు వచ్చిన ఫలితం పట్ల ఇస్రో బృందం సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక, 30 నిమిషాల ప్రయోగం సందర్భంగా శాస్త్రవేత్తలంతా ఉత్కంఠతకు గురైనట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు. ‘ప్రయోగం జరుగుతున్న 30 నిమిషాల సమయం ఉత్కంఠతకు లోనయ్యాం. టైం గడుస్తున్న కొద్దీ భవనమంతా ఉద్విగ్నత, ఆతృతతో నిండిపోయింది. చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా రిలాక్స్ అయ్యాం. ఉల్లాస వాతావరణం నెలకొంది’ అంటూ ఆపరేషన్ జరుగుతున్నప్పటి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఈ ప్రయోగం ఫలితంగా మనం త్వరలోనే మరోసారి చంద్రుడిని కలుసుకోబోతున్నామని ఇస్రో చీఫ్ విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రయాన్-1 పేరుతో 2008లో చంద్రుడిపైకి ఇస్రో తొలి ప్రయోగం చేపట్టింది. ప్రయోగం అనుకున్నట్టు సాగితే సెప్టెంబర్ 2న రోవర్‌ను విడిచి ప్రయాణిస్తుంది. సెప్టెంబర్ 7నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుందని కె.శివన్ తెలిపారు. ప్రయోగం చివరి దశ వరకూ సజావుగా సాగితే చంద్రుడిపై అంతరిక్ష నౌకను దించిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ చేరుతుంది. చంద్రయాన్-2 గమనంపై 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ఇస్రోలో దాదాపు 200 మందికి పైగా శాస్త్రవేత్తలు మంగళవారం సమావేశం అయ్యారు. చంద్రయాన్2 విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేరుకోగానే ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు
No comments:
Post a Comment