Breaking News

24/08/2019

తెలంగాణలో సీజనల్ సీజన్

హైద్రాబాద్, ఆగస్టు 24, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వివిధ రోగాలతో బాధ పడుతూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పలు హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. సుమారు 3 లక్షల మందికి పైగానే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని లెక్కిస్తే..మరింత ఎక్కువగా ఉండనుంది. వైరల్ ఫీవర్‌తో ఎంతో మంది బాధ పడుతున్నారు. పలువురు డెంగీ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సీజనల్ వ్యాధులతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
తెలంగాణలో సీజనల్ సీజన్

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జ్వరాలపై ప్రజలు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బోధనాసుపత్రుల వరకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేక విభాగం ఆధ్వర్యంలో 24 గంటలూ సీజనల్ వ్యాధుల సరళిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరాలతో పాటు ఇతర రోగాలు వస్తుంటాయి. ఈ కాలంలో వచ్చే విష జ్వరాల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌లు చాలా ముఖ్యమైనవి. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధులు వస్తాయి. దోమలు కుట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

No comments:

Post a Comment