Breaking News

12/08/2019

స్కిల్ డెవపల్ మెంట్ లో విద్యార్ధులకు శిక్షణ :విద్యాసాగరరావు

కరీంనగర్, ఆగస్ట 12  (way2newstv.in - Swamy Naidu):
భారతదేశంలో ఉన్న యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి..ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు వెల్లడించారు. అమ్మక్కపేటలోని వృత్తి శిక్షణ కేంద్ర ఏర్పాటులో జీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు కృషి చాలా ఉందన్నారు.వేలాది మంది ఉద్యోగాలు కల్పిస్తాం..ఒక్కోక్కరికి రూ. 50వేలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి తీరుతామని జీయర్ స్వామి, రామేశ్వర్ రావులు హామీనిచ్చారన్నారు. 2019, ఆగస్టు 12వ తేదీ సోమవారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం అమ్మక్కపేటలో వృత్తి శిక్షణ కేంద్రం ప్రారంభం జరిగింది. 
స్కిల్ డెవపల్ మెంట్ లో విద్యార్ధులకు శిక్షణ :విద్యాసాగరరావు
మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు, మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వర్ రావు, ఎంపీలు అరవింద్, బండి సంజయ్, ఎమ్మెల్యేలు విద్యా సాగర్, సంజయ్‌లు హాజరయ్యారు. జీయర్ ట్రస్టు, ప్రతిమ ఫౌండేషన్, టాటా సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటైంది. ప్రపంచ దేశాల్లో యువత పెద్ద సంఖ్యలో ఉందని..నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనేది గవర్నర్ విద్యాసాగర్ రావు ఆలోచన అన్నారు రామేశ్వర్ రావు. ఇలాంటి శిక్షణ కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఫిట్టర్, ఎలక్ట్రికల్, సోలార్ రంగాల్లో నిరుద్యోగులకు శిక్షణ లభిస్తుందన్నారు. స్వయం కృషితో ఒంటరిపోరాటం చేసి..రామేశ్వరరావు ఉన్నతస్థాయికి ఎదిగారని చెప్పారు ఎంపీ అరవింద్. నిర్మాణ రంగంలో ఆయన దగ్గర తాను శిక్షణ తీసుకున్నట్లు, క్రమ శిక్షణ, నైపుణ్యంతో వ్యాపారంలో విజయం సాధించినట్లు  తెలిపారు. వృత్తిలో నైపుణ్యం సాధిస్తేనే జీవితంలో రాణించగలమని సూచించారు

No comments:

Post a Comment