Breaking News

27/08/2019

కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి ఆగస్టు 27, (way2newstv.in - Swamy Naidu)
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు. ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.  ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. 
కోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్సేవ, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.సెప్టెంబరులోశ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలుశ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. -  సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్సేవ నిర్వహిస్తారు. - సెప్టెంబరు 14న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.- సెప్టెంబరు 24న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో 
పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్సేవ నిర్వహిస్తారు.

No comments:

Post a Comment