Breaking News

23/08/2019

ట్రాఫిక్ రైడర్లు బేఫికర్

హైద్రాబాద్, ఆగస్టు 23, (way2newstv.in - Swamy Naidu)
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీసులు ఎంతగా చెబుతున్నా మోటార్‌సైకిల్‌పై వెళ్లే వారు పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది జనవరి, 1వ తేదీ నుంచి జులై, 26వ తేదీ వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన బైక్ రైడర్స్‌పై పోలీసులు 40,80,477 కేసులు నమోదు చేశారు. ఈ కేసులు ఎక్కువగా హెల్మెట్, ఓవర్ స్పీడ్, ప్రమాదకరమైన డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉన్నాయి. హెల్మెట్ పెట్టు కోని వారిపై హైదరాబాద్‌లో 21,42,908, సైబరాబాద్‌లో 8,12,779, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో 6,44,525 కేసులు నమోదు చేశారు.మూడు కమిషనరేట్ల పరిధిలో హెల్మెట్ కేసులు 36,00,212 కేసులు నమోదయ్యాయి. 
 ట్రాఫిక్ రైడర్లు బేఫికర్
ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లేదా డేంజరస్ డ్రైవింగ్ చేసిన వారిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1,15,069,49,812,23,061 కేసులు న మోదు చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు హైదరాబాద్‌లో 51,335,34,584,16,466 కేసులు నమోదయ్యాయి. ట్రిపుల్ రైడింగ్ హైదరాబాద్‌లో 67,229,13826,5,436 కేసులు నమోదయ్యాయి. సిగ్నల్ జంప్ చేసిన వారిపై హైదరాబాద్‌లో 14,274,01,269,4,777 కేసులు పోలీసులు నమోదు చేశారు. నండర్ ప్లేట్ సరిగా లేని వారు హై దరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 13,270,7,554, 3,106 కేసులు నమోదు చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్ హైదరాబాద్‌లో 12,154, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,761, రాచకొండలో 2,627 కేసులు నమోదు చేశారు. మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారు హైదరాబాద్‌లో 8,154,7,455, 599 పట్టుబడ్డారు. డేంజరస్ డ్రైవింగ్ చేసిన వారిపై హైదరాబాద్‌లో 2,779,03,087,0482 కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లు హైదరాబాద్‌లో 3,144, సైబరాబాద్‌లో 1,476, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 మంది మొత్తం 4,630 మంది పట్టుబడ్డారు.మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 646 మంది మృతిచెందారు. ఇందులో మోటార్ సైకిల్‌పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోకపోవడంతో 382 మంది మరణించారు. మూడు పోలీస్ కమిషనర్లే పరిధిలో హెల్మెట్ పెట్టుకోని వారి మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో మోటార్ వాహనదారులు 432మంది మృతిచెందారు..అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి నగరాన్ని యాక్సిడెంట్ ఫ్రీ సిటీ చేయాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ఫేస్‌బుక్, ట్విటర్, ట్రాఫిక్ హెల్ప్ లైన్(9010203626), ట్రాఫిక్ లైవ్ యాప్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు

No comments:

Post a Comment