Breaking News

24/08/2019

రాజధాని రైతుల సమరం

హైద్రాబాద్, ఆగస్టు 24  (way2newstv.in)
రాజధాని తరలింపు వార్తలతో అమరావతిలో అలజడి రేగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా తమకు కౌలు చెల్లించకపోవడంతో ఆందోళనతో ఉన్న రైతులకు.. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో భయం పెరిగింది. ఇటు రాజధాని ప్రాంతంలో పనులు కూడా నిలిపివేయడంతో భూముల, పొలాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్న రాజధాని రైతులు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. తాజాగా రాజధాని రైతులు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు. 
రాజధాని రైతుల సమరం

రాజధాని తరలింపు వార్తలు వస్తున్నాయని.. తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని మారుతుందని ప్రచారం జరుగుతోందని.. ముంపు పేరుతో అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కౌలు చెల్లించలేదని పవన్‌కు చెప్పి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అమరావతి రైతులు శుక్రవారం రోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి తమ సమస్యల్ని వివరించారు. తమకు కౌలు అందలేదని.. ఇబ్బందుల్లో ఉన్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కన్నా కూడా వెంటనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ఏటా చెల్లించే లీజు మొత్తాన్ని వెంటనే మంజూరు చేయాలని సీఎంను డిమాండ్ చేశారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో రైతులకు డబ్బులు ఇచ్చేవారని, ఈ సారి సెప్టెంబర్ సమీపిస్తున్నా డబ్బులు ఇవ్వలేదన్నారు. 

No comments:

Post a Comment