Breaking News

01/08/2019

వరుస వానలతో జలకళ

ఆసిఫాబాద్ ఆగస్టు 1, (way2newstv.in)
కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో వరుసగా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. జలాశయాలన్నీ నిండు కుండల్లా మారుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వరుస వానలతో జలకళ

అసిఫాబాద్ మండలంలోని కుమురం భీం జలాశయం గేట్లు ఎత్తి నీటిని వదలడంతో గుండి వాగు ప్రవాహం పెరిగింది. కుమురం భీం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీ.కాగా ప్రస్తుతం 241.100 మీ.లకు పెరిగింది. 5,080 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది.అలాగే వట్టివాగు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 239.500 మీ.లు కాగా 237.500 మీ.లకు చేరింది. 2,697 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది.ఇక ఈ అందాలను చూసేందుకు సందర్శకుల తాకిడి పెరగడంతో అధికారులు భద్రత చర్యలు తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment