Breaking News

26/08/2019

పోరాటలతోనే సమస్యల పరిష్కారం - జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరాహత్ అలీల పిలుపు

హుస్నాబాద్, ఆగస్టు 26 (way2newstv.in - Swamy Naidu
దాదాపు అరవై ఏండ్ల సుధీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగివున్న తమ యూనియన్ నాటి నుండి నేటి వరకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం కృషి చేస్తుందని తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు స్పష్టం చేశారు. ఆదివారం నాడు డివిజన్ కేంద్రమైన హుస్నాబాద్ లోని కళ్యాణ్ లక్ష్మీ ఫంక్షన్ హాలులో జిల్లా అధ్యక్షులు కె.రంగాచారీ అధ్యక్షతన జరిగిన టీయుడబ్ల్యుజె సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్యతిథులుగా హాజరై ప్రసంగించారు. 
పోరాటలతోనే సమస్యల పరిష్కారం - జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరాహత్ అలీల పిలుపు
ఓ వైపు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై ఉద్యమిస్తూనే మరో వైపు సామాజిక స్పృహతో ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకొని ప్రజా సంఘంగా గుర్తింపు పొందిన ఘనత నాటి మెదక్ ఉమ్మడి జిల్లా శాఖకు దక్కిందని, అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లా శాఖ ఆదర్శ జిల్లా శాఖగా గుర్తింపు పొందాలని శేఖర్, విరాహత్ లు సూచించారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ఉన్న రాష్ట్రంలో దీర్ఘకాలికంగా జర్నలిస్టులు అనుభవిస్తున్న సమస్యలను మాత్రం పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహించడం విచారకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంఘం వేలాది మందితో జర్నలిస్టుల గర్జన, వందలాది మందితో చలో ఢిల్లీ లాంటి చారిత్రాత్మకమైన పోరాటాలు నిర్వహించినా పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహ రించడం సహించారనిదన్నారు. అయినా తమ సంఘం వివిధ రూపాల్లో పోరాడుతూనే ఉందని వారు స్పష్టం చేశారు. ప్రధానంగా ఇండ్లు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డుల అమలు, అందరికీ అక్రెడిటేషన్లు తదితర డిమాండ్లతో త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో చేపట్టబోయే పలు కార్యక్రమాలపై చర్శించి తీర్మానాన్ని ఆమోదించారు. ఇంకా ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ సభ్యులు కొమురవెళ్లి అంజయ్య, జిల్లా సలహాదారులు అరుణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు రాజిరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం బాధ్యులు సుభాష్, కిరణ్, జిల్లా కార్యదర్శి అజయ్, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు ఫజల్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment