Breaking News

21/08/2019

కర్ణాటకలో ఉప ఎన్నికలు తప్పేలా లేవు

బెంగళూర్, ఆగస్టు 21, (way2newstv.in)
కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 17 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును స్పీకర్ రమేష్ కుమార్ వేసిన సంగతి తెలిసిందే. వీరు తమ అనర్హత వేటుపై సుప్రీంకోర్టును ఆశ్రయంచారు. ఇంకా దీనిపై సుప్రీంకోర్టు విచారించి తీర్పు చెప్పాల్సి ఉంది.ఈలోగానే జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా తమ అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనంటూ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. 
కర్ణాటకలో ఉప ఎన్నికలు తప్పేలా లేవు

అనర్హత వేటు పడిన 17 నియోజకవర్గాలలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. సిద్ధరామయ్యతో పాటు మాజీ మంత్రులు డీకే శివకుమార్, పీసీీసీ చీఫ్ దినేష్ గుండూరావు తదితరులు పర్యటించాలని నిర్ణయించారు. అభ్యర్థుల జాబితాను కూడా రెడీ చేశారు.ఇక జనతాదళ్ ఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సయితం ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఆ మూడు చోట్ల తిరిగి గెలవాలని దేవెగౌడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే దేెవెగౌడ జిల్లాల పర్యటనను ప్రారంభించారు. ఈ 17 నియోజకవర్గాల్లోనూ జేడీఎస్ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయింది. ఈ మేరకు మొన్నటి వరకూ మిత్రపక్షమైన కాంగ్రెస్ కు కూడా సంకేతాలు పంపింది.ఎటొచ్చీ ఇప్పుుడు భారతీయ జనతా పార్టీకే ఇబ్బంది వచ్చి పడింది. ఉప ఎన్నికలు జరిగితే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోటీ చేయడానిక వీలుండదు. అలాగని తమకోసం త్యాగం చేసిన వారు సిఫార్సు చేసిన వారికి టిక్కెట్ ఇవ్వక తప్పదు. అప్పటికే అక్కడ ఉండి, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన బీజేపీ నేతల సహకారం కూడా అవసరం. ఇవన్నీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి బీజేపీది. అందుకోసమే అందరి అభిప్రాయం తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. మొత్తం మీద ఉప ఎన్నికలంటూ వస్తే కర్ణాటక రాజకీయం మరోసారి రసవత్తరంగా మారనుంది.

No comments:

Post a Comment