Breaking News

08/08/2019

బంగాళాఖాతంలో అల్పపీడనం: పొంచివున్న తుఫాను ముప్పు!

న్యూఢిల్లీ ఆగస్టు 08,(way2newstv.in)
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలకు తుఫాను తోడు కానుంది.  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన పలు రాష్ట్రాలకు తుఫాను ముప్పు పొంచివుంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. వాయుగుండంగా మారుతోంది.  మరో 48 గంటల్లో ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.  
బంగాళాఖాతంలో అల్పపీడనం: పొంచివున్న తుఫాను ముప్పు!

ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడింది.  క్రమంగా వాయుగుండంగా మారుతోందని అధికారులు తెలిపారు.  ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒడిశాలోని బాలాసోర్ కు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది ఒడిశా వైపు కదులుతోందని అన్నారు.  అల్పపీడన కేంద్రం పశ్చిమబెంగాల్ లోని దిఘా పట్టణానికి 100 కిలోమీటర్ల దూరం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.  దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్ లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.  మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.  ఏపీ, ఒడిశా, దక్షిణ ఛత్తీస్ ఘడ్, దక్షిణ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఉత్తర తెలంగాణల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చని చెప్పారు.  ఆయా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment