Breaking News

06/08/2019

అక్టోబర్ వరకు డెంగీ ..జరా భద్రం

హైద్రాబాద్ లో భారీగా లక్షణాలు
హైద్రాబాద్, ఆగస్టు 6, (way2newstv.in)
 డెంగీ మళ్లీ విజృంభిస్తోంది... గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది.. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. పద్మారావునగర్‌కు చెందిన మరో చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. నగరంతోపాటు.. మెదక్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ తదితర జిల్లాల నుంచి గాంధీ ఆసుపత్రికి డెంగీ లక్షణాలతో పలువురు వస్తున్నారు.  నెల రోజుల్లో 291 మంది ఈ జ్వర లక్షణాలతో గాంధీలోని ఔట్‌పేషెంట్‌ విభాగానికి వచ్చారు. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా వీరిలో 92 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది.  చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా జులై, ఆగస్టు నెలలు వచ్చాయంటే ...డెంగీ ప్రబలుతోంది. వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండటంతో .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. 
 అక్టోబర్ వరకు డెంగీ ..జరా భద్రం

నియంత్రణకు అధికారులు తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా.. బస్తీల్లో ఆరోగ్య శిబిరాలు.. ఆరోగ్య పరీక్షలు వంటివి చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గత అనుభవాలను బట్టి చూస్తే...ఈ ముప్పు జులై నుంచి అక్టోబరు వరకు కునుకు లేకుండా చేస్తోంది.దోమకాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ప్రారంభమవుతాయి.హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది. తలనొప్పి, కళ్ల వెనుక నుంచి నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒళ్లు-కీళ్ల నొప్పులు, వాంతి వికారం, ఆకలి లేకపోవడం తదితర సమస్యలు ఉంటాయి. జ్వరం రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది. తగ్గుతున్న దశలోనే మరింత  ఈ లక్షణాలు కన్పిస్తే డెంగీ జ్వరం అవునో...కాదో..తెలుసుకునేందుకు డెంగీ యాంటిజెన్‌ పరీక్ష(ఎన్‌ఎస్‌-1) చేయించుకోవాలి. ఈ పరీక్షలో జ్వరం వచ్చిన తొలిరోజే అది డెంగీనో...కాదో కచ్చితంగా నిర్ధరణ అయిపోతుంది.  ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చేయలేవు.  ఒక ప్రాంతంలో డెంగీ జ్వరాలు ఉన్నట్లు తేలితే..వెంటనే పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవడం ద్వారా మరింత మందికి ఈ జ్వరం రాకుండా నియంత్రించవచ్చు.డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకం. చూడటానికి  కాస్త పెద్దగా, నల్లటి చారలతో కనిపిస్తుంది. దీన్ని టైగర్‌ దోమగా పిలుస్తారు.ఎక్కడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, వాడి పడేసిన ప్లాస్టిక్‌ గ్లాసులు వంటివి లేకుండా చూసుకోవాలి.  నీళ్ల ట్యాంకులు, కూలర్లు, పూలకుండీలను వారానికోసారి ఆరబెట్టాలి.  పిల్లలకు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, సాక్సులు మంచిది. కాళ్లు చేతులకు దోమల నివారణ క్రీములు రాయాలి. డెంగీ జ్వరం తగ్గిపోయే దశ చాలా కీలకం. ఒంటి మీద ఎర్ర మచ్చలు రావటం, ప్లేట్‌లెట్లు పడిపోవడం, బీపీ తగ్గడం వంటివి ఆరంభమవుతాయి. ఇది ప్రమాదకరమైన దశ. జ్వరం ఉన్నప్పుడు కాదు... తగ్గుతున్నప్పుడే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. జ్వరం తగ్గాక ఒంటి మీద ఎర్రటి మచ్చలు వస్తున్నా..తీవ్ర నిస్సత్తువగా ఉన్నా కాళ్లు, చేతులు చల్లగా ఉంటున్నా...కడుపులో నొప్పి, వాంతులు ఎక్కువ అవుతున్నా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా..పడుకొని లేవగానే కళ్లు తిరుగుతున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. 

No comments:

Post a Comment